Neti Satyam
Newspaper Banner
Date of Publish : 07 June 2025, 4:52 am Editor : Admin

యూరియా పై చేతులెత్తేసినట్టేనా?




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

. జూన్ నాటికి రాష్ట్రానికి రావాల్సింది 5 లక్షల మెట్రిక్ టన్నులు
. ఇప్పటివరకు వచ్చింది 2.19 లక్షల మెట్రిక్ తనులే
యూరియా కోసం మూడు సార్ల కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖలు
. విదేశీ యూరియా కేటాయింపులు లతో సరపర సమస్య
. మరమ్మతులతో రామగుండంలో ఆగిన ఉత్పత్తి.

నేటి సత్యం.. యూరియా కోసం అన్నదాతలు దుకాణాల ముందు క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి తప్పేలా లేదు వానాకాలం సీజన్కు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియాను సరఫరా చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేస్తున్నడంతో రైతులు దిక్కులు చూసే పరిస్థితిలో ఏర్పడింది రాష్ట్రంలో సాగు విస్తరణ పెరుగుతునడంతో యూరియా
కేటాయింపులు పెంచాలన్న రాష్ట్ర విజ్ఞప్తిని పట్టించుకోని కేంద్ర
ప్రభుత్వం గత సీజన్లో మాదిరిగానే 9.80 లక్షల మెట్రిక్
కేటాయించింది
ఈ మేరకు నెలవారి సరఫరా ప్రణాళికను రాష్ట్రానికి పంపించింది దాని ప్రకారం ఏప్రిల్ నుంచి కోటను పంపించాలి గత సంవత్సరం సీజన్ ప్రారంభానికి ముందే ఐదు లక్షల టన్నులు యూరియా పంపింది అదే తరహాలో ఈ ఏడాది కూడా సీజన్ ఆరంభానికి
ముందే 5 ఎల్ ఎం టి యూరియాను నిలువ ఉంచుకోవాలి రాష్ట్ర వ్యవసాయ శాఖ చేసిన ప్రయత్నం ఫలించలేదు జూన్ నాటికి రాష్ట్రానికి 5 ఎల్ఎంటి యూరియా రావలసి ఉండగా
ఇప్పటివరకు వచ్చింది 2.19 ఎల్ ఏంటి మాత్రమే మే జూన్ నెలలో 3.70 ఎల్ఎంటి రావాలి కానీ 1.14 ఎల్ఎంటి కోత పడుతుందని అధికారులు తెలిపారు