చండ్ర రాజేశ్వర రావు గారి 111 వ జయంతి సందర్భంగా ఈ రోజు ఉదయం హైదరాబాద్ కొండాపూర్‌లోని సిఆర్ ఫౌండేషన్‌లో చండ్ర రాజేశ్వరరావు (సిఆర్) విగ్రహానికి చండ్ర రాజేశ్వర రావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ ఉపాధ్యక్షులు, సీ పి ఐ జాతీయ కార్యదర్శి, మాజీ రాజ్య సభ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, సి ఆర్ ఫౌండేషన్ కార్యదర్శులు చెన్నమనేని వెంకటేశ్వరరావు, మాజి ఎం ల్ సి పి . జె. చంద్ర శేఖర్ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ –
సి ఆర్ జీవితం దేశం మొత్తం గర్వపడే విధంగా కృషి చేశారని, ఆయన ప్రజల కొరకు ఎన్నో త్యాగాలను చేశారని, ఒకసారి నార్త్ ఇండియా లోని ఒక జిల్లాలో సంక్షోభం ఏర్పడితే వారం రోజులు అక్కడే ఉండి ప్రజా ప్రజల బాగోగులను చూసుకుంటూ 500 మందిని రక్షించారని తెలిపారు. ప్రధాని నెహ్రూ ఉన్న రోజులలో ఆయనకు వ్యతిరేకంగా పోరాడి దేశ సమగ్ర అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల నడుస్తూ పీడిత ప్రజల అభ్యున్నతికి, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని అజీజ్ పాషా కోరారు.
ఈ కార్యక్రమంలో సి ఆర్ ఫౌండేషన్ కోశాధికారి చెన్నకేశవరావు, ఆరోగ్య కేంద్రం డైరెక్టర్ డాక్టర్ కె రజిని,
ఎ ఐ టి యూ సి మాజీ కార్యదర్శి బి వి విజయలక్ష్మి , మహిళా సంక్షేమ కేంద్రం డైరెక్టర్ జోశ్యభట్ల కల్పన , వృద్ధాశ్రమ సలహా కమిటీ సభ్యులు డాక్టర్ మండవ గోపీచంద్, తమ్మారెడ్డి తాన్య, యన్. రాజేంద్ర రావు, డాక్టర్ పి సరస్వతి, మహిళాసంక్షేమ కేంద్రం సభ్యులు వి లలిత, టెక్సాస్ యూనివర్సిటీ స్కాలర్ మిస్ మేరీ, వృద్ధాశ్రమ వాసులు, విద్యార్దినిలు, తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.