(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఎన్నో చారిత్రక, సాహసోపేత నిర్ణయాలతో , విజయాలతో మోదీ ప్రభుత్వ పాలన…11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం… సంకల్ప సాకారం పేరిట చేపట్టాల్సిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలి..గన్నేరువరం.
ఈరోజు తెలంగాణ. జూన్ 6(ముడికే రమేష్ యాదవ్):
గన్నేరువరం మండల కార్యశాల లో బీజేపీ అధ్యక్షలు తిప్పర్తి నికేష్ మాట్లాడుతు 2014 నుండి నేటి వరకు 11 ఏళ్ల మోడీ ప్రభుత్వ పాలనలో భారతదేశానికి విశ్వఖ్యాతి వచ్చిందని , దేశ దిశా దశ మారిందని , గత 11 ఏళ్లలో మోడీ సర్కార్ దేశం కోసం ఎన్నో అద్భుతాలు చేపట్టి సాహసోపిత చారిత్రక నిర్ణయాలతో , విజయాలతో ముందు కొనసాగుతుందని బిజెపి….. అన్నారు.. బిజెపి జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా ఆదేశాల మేరకు 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం – సంకల్ప సాకారం పేరిట చేపట్టే వివిధ కార్యక్రమాల కోసం శుక్రవారం రోజున బిజెపి శ్రేణులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ స్టేట్ కాన్సిల్ నంబర్ పుప్పాల రఘు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమర్థవంతమైన , నిర్ణయాత్మక నాయకత్వంలో , వికసిత్ భారత్ లక్ష్య సహకారం దిశగా ఆత్మవిశ్వాసం తో, ఎన్నో చారిత్రక విజయాలతో మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు విజయవంత పాలన పూర్తి చేసుకుంటుందని తెలిపారు. మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని, అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ లాంటి చారిత్రక విజయంతో దేశ ఖ్యాతి విశ్వంలో మార్మోగిపోతుంద న్నారు. జాతీయ పార్టీ పిలుపుమేరకు 11 సంవత్సరాల మోడీ ప్రభుత్వం… సంకల్ప సాకారం పేరిట చేపట్టాల్సిన వివిధ ప్రోగ్రాంలను బిజెపి శ్రేణులు అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అందులో ముఖ్యంగాజూన్5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 15 వరకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని, తల్లి పేరుతో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. అలాగే 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం, 23న డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్, 25న ఎమర్జెన్సీ డే లాంటి ముఖ్య కార్యక్రమాలను ఉన్నాయని, పార్టీ సూచన పత్రంలో ఉన్న అన్ని కార్యక్రమాలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. 11 ఏళ్ల మోదీ ప్రభుత్వ విజయవంత పాలన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ , ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేస్తూ , ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా చేపట్టిన భారత త్రివిదదళాలకు, ప్రధాని మోదీ కి అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశంలో తీర్మానం చేసి ఆమోదించారు.ఈ కార్యక్రమలో పాల్గొన్నవారు ఈ కార్యక్రమ కన్వీనర్ ఎలెటి చంద్రారెడ్డి, కో కన్వీనర్ పుల్లేల రాము, మచ్చ బాలరాజు,అటికం రామచంద్రం,బండి తిరుపతి,నందికొండ సురేందర్ రెడ్డి,కాంతాళ రాజిరెడ్డి, కాంతాల శ్రీనివాస్ రెడ్డి ,నందికొండ స్వామి రెడ్డి ,గీకురు అంజయ్య ,గుంటుకు లక్ష్మీపతి ,కనుకుంట్ల విష్ణు, విలాసారం రాములు, దొంగల జగన్, జి నరసింహస్వామి, సిహెచ్ అమర్ పాల్గొనరు