Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 June 2025, 8:39 am Editor : Admin

ప్రభుత్వ బడిలో విద్యార్థుల చేరుటకై ఊరిలో బడిబాట ఉపాధ్యా యులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

విద్యార్థుల చేరిక కై

“ఏల్లూరు లో బడిబాట ”

కొల్లాపూర్, జూన్ 10. (ఈ రోజు తెలంగాణ ప్రతినిధి)

పిల్లలకు ఉచితము గా పాఠ్య పుస్తకాలను, ఉచిత స్కూల్ డ్రెస్సులను, మధ్యాహ్న భోజన పథకము ను కల్పిస్తూ మంచి శిక్షకులైన ఉపాధ్యాయులచే ఉచితము గా విద్యాబోధన చేస్తున్న ప్రభుత్వ పాఠశాల లోనే మీ పిల్లలను చేర్పించండి అంటు ఎల్లూరు గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు ఏల్లూరు గ్రామం లోని బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

“బడిబాట” కార్యక్రమము లో భాగం గా మంగళవారం ఉదయం కొల్లాపూర్ మండలం ఏల్లూరు గ్రామం లో గ్రామ పెద్దలు, విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రస్తుత పాఠశాల ఉపాధ్యాయులు వీధి వీధి తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలు చేస్తున్న విద్యా బోధన గురించి గ్రామం లోని బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ వారి పిల్లలను ఎల్లూరు గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని కోరిన కోరిక మేరకు బడి ఈడు పిల్లల తల్లిదండ్రులు సానుకూలం గా స్పందిస్తూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల లోనే చేర్పిస్తామని ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలకు తమ అంగీకార సమ్మతులను తెలియజేశారు.

ఇట్టి బడిబాట కార్యక్రమం లో ఏల్లూరు గ్రామ పూర్వ సర్పంచ్ లు జట పోలు శేఖర్ రెడ్డి , సోమిశెట్టి చంద్రశేఖర్ శెట్టి, బాల్రెడ్డి షబ్బీర్ ( రిటైర్డ్ టీచర్), ఉపాధ్యాయులు రఘువరన్ రెడ్డి, మునీశ్వర్, డి. శ్రీకాంత్ , రంగినేని శ్రీధర్ , రాము, చక్రధర్ రెడ్డి, కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.[ez-toc]