Neti Satyam
Newspaper Banner
Date of Publish : 10 June 2025, 9:58 am Editor : Admin

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి పాలమాకుల జంగయ్య




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి*

*ఘనంగా చేవెళ్ల మండల సిపిఐ మహాసభలు*

*సిపిఐ జిల్లా కార్యదర్శ పాలమాకుల జంగయ్య*

ఈరోజు చేవెళ్ల మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల మండల సిపిఐ మహాసభలు మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల పైన మైనారిటీల పైన దాడులు పెరిగాయని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి బడా బాబులకు బడా పారిశ్రామికవేత్తల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి పనిచేస్తుందని ఎన్నికలకు రాకముందు విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకువచ్చి ప్రతి పౌరుడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానన్న మోడీ 11 సంవత్సరాల ఆయన 11 రూపాయలు కూడా వేయలేని దుస్థితి నెలకొందని వాపోయారు ఒకపక్క యువతీ యువకులకు ఉద్యోగాలు రాక చెడు విసరాలకు బానిసలై బలైపోవడం జరుగుతుందని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న మోడీ లక్ష ఉద్యోగాలు చేయలేదని తెలిపారు అదే విధంగా రోజు రోజుకు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని దానికి అనుగుణంగా ప్రజల యొక్క తరసరి ఆదాయం పెరగటం లేదని వాపోయారు రోజురోజుకు ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుందని ప్రజల కొనుగోలు శక్తి పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ప్రజాపాలన ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అధికారాలను వచ్చిన తర్వాత ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రజలు చెల్లించే పన్నులు ఎక్కడ పోతున్నాయని ప్రశ్నించారు చేవెళ్లలోని 75 వ సర్వే నెంబర్ లో సుమారు రెండున్నర సంవత్సరాల నుండి భూ పోరాట కేంద్రంలోగుడిసెలు వేసుకున్న గుడిసె వాసులకు మౌలిక సదుపాయాలు మంచినీటి సౌకర్యం కరెంటు సౌకర్యం మొబైల్ టాయిలెట్ సౌకర్యం కల్పించి పట్టాలు ఇవ్వాలని లేదా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరారు ఈరోజు జరిగిన చేవెళ్ల మండల మహా సభలలో నూతన కమిటీని 27 మంది కౌన్సిల్ సభ్యులతో 11 మంది కార్యవర్గ సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ప్రకటించారు రెండవసారి సిపిఐ చేవెళ్ల మండల కార్యదర్శిగా ఏం సత్తిరెడ్డిని సహాయ కార్యదర్శులుగా ఎండి మక్బూల్ వడ్ల మంజులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఎన్నుకోబడిన నూతన కమిటీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు చేవెళ్ల నియోజకవర్గం ఇంచార్జ్ కే రామస్వామి ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం ప్రభు లింగం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బి సుభాన్ రెడ్డి ఏం సుధాకర్ గౌడ్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ బి కే ఎం యు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య శంకర్పల్లి మండల కార్యదర్శి సుధీర్ ఏఐటియుసి మండల అధ్యక్షుడు శివ గీత పని వాళ్ళ సంఘం మండల కార్యదర్శి కృష్ణ గౌడ్ నీలని ఎలీషా కృష్ణ లలిత మీనాక్షి జయమ్మ బాబురావు పాపయ్య వినోద ఒగ్గు సత్యనారాయణ కృష్ణ చారి పోచయ్య అంజిరెడ్డి మల్లారెడ్డి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు