Neti Satyam Logo
e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
HomeUncategorizedఅర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి బాల నరసింహ

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి బాల నరసింహ

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ.
తెలకపల్లి. నేటి సత్యం . జూన్ 10

తెల్కపల్లి జూన్ 6 అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల్ నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ) 18వ మండల మహాసభలు మండల కేంద్రంలో ని శివగంగ ఫంక్షన్ హాల్ లో జిల్లా సమితి సభ్యులు శంకర్ గౌడ్.బాలమురళి కృష్ణ అద్యక్షతన జరిగింది మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామంలో అర్హులైన అన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గ్రామంలో ఎంత మంది లబ్ధిదారులకు ఇండ్లు మంజూరు జాబితా వివరాలను గ్రామపంచాయతీ నోటీస్ బోర్డుపై లిస్టు పెట్టాలని అన్నారు . వీటితోపాటు రాజీవ్ యువ వికాస పథకంలో దరఖాస్తు పెట్టుకున్న నిరుపేద యువకులకు సివిల్ స్కోర్ తో సంబంధం లేకుండా రుణాలు మంజూరు చేయాలని పేర్కొన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి
తెలంగాణ సాయుధ రైతంగా పోరాటానికి వక్ర భాష్యం చెబుతు కమ్యూనిస్టుల నాయకత్వంలో భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన సాయుధ రైతంగా పోరాటాన్ని హిందువులు ముస్లింలపై చేసిన మతపరమైన యుద్ధంగా చెబుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాని హైజాక్ చేస్తుందని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుండా మతం పేరుతో ప్రజలను విభజించి మతం సామరస్యానికి విఘాతం కలిగించే చర్యలకుపూను కొంటుందని.ఆయన విమర్శించారు . ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే కేశవులు గౌడ్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బాలమురళీకృష్ణ తెల్కపల్లి సిపిఐ మండల కార్యదర్శి వేనేపల్లి రవీందర్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సూర్య శంకర్ గౌడ్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివ శంకర్ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశామోని ఆంజనేయులు సిపిఐ తెల్కపల్లి మండల కౌన్సిల్ సభ్యులు ఎస్ బాలస్వామి ఏ వెంకటస్వామి డి సీతయ్య విష్ణు బుగ్గ స్వామి డి బిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments