(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
సిపిఐ చేవెళ్ల మండల కార్యదర్శిగా ఎం సత్తిరెడ్డి సహాయ కార్యదర్శులుగా ఎండి మక్బూల్ వడ్ల మంజుల ఎన్నిక
10/06/2025 రోజున చేవెళ్ల మండలంలోని అంబేద్కర్ భవనంలో సిపిఐ మండల మహాసభలు ఘనంగా జరిగినాయి ఈ మండల మహాసభలలో సిపిఐ చేవెళ్ల మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది రెండవసారి మండల కార్యదర్శిగా ఏం సత్తిరెడ్డి సహాయ సహాయ కార్యదర్శులుగా ఎండి మక్బుల్ వడ్ల మంజులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఎం సత్తిరెడ్డి మాట్లాడుతూ నాపై ఎంతో నమ్మకం ఉంచి నాకు రెండవసారి సిపిఐ మండల కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జిల్లా నాయకత్వానికి మండల నాయకత్వానికి ప్రజా సంఘాల నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు పేద ప్రజలకు అండగా ఎర్రజెండా ఉంటుందని అదే మా ఎజెండా అని పార్టీ నిర్మాణం కోసం ప్రజాసంఘాల నిర్మాణం కోసం మేమందరం కష్టపడి పనిచేసి పేద ప్రజలకు కష్టజీవులకు కర్షకులకు రైతులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలబడి పోరాడుతామని ఒక ప్రకటనలో తెలిపారు