(adsbygoogle = window.adsbygoogle || []).push({});
రైతులకు వానకాలం రైతు భరోసా డబ్బులు వెంటనే రైతు లా ఖాతాలో జమ చేయాలి?
వార్ల వెంకటయ్య సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు డిమాండ్,
నేటి సత్యం నాగర్ కర్నూల్. జూన్ 11
తాడూరు మండలం భల్లన్ పల్లీ, గ్రామంలో సిపిఐ శాఖ మహా సభ సమావేశం డాంగట్ల వెంకటస్వామి అధ్యక్షతన జరిగింది,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వార్ల వెంకటయ్య సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, పాల్గొని మాట్లాడుతూ రైతులకు వానకాలం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో వెయ్యాలని పిలుపునిచ్చారు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంవత్సరం నర గడుస్తున్న రైతు భరోసా డబ్బులు రైతులకు వేయడంలో పూర్తిగా విఫలం చెందారని ఆయన అన్నారు,
ఆరుకాలం పంటలు వండించి నా రైతుకు గిట్టుబాటు ధర లేక సన్న వడ్లకు రూ,500/ లు బోనస్ ఇవ్వడంలో పూర్తీ విఫలం అయ్యారు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి రైతులకు వ్యవసాయ పనిముట్లను సబ్సిడీ ల ద్వారా రైతులను ఆదుకోవాలి,
భూమిలేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం ఐడెంటి కార్డులు ఇచ్చి రైతు భరోసా డబ్బులు సంవత్సరానికి రూ 12,000 వేయాలి, రైతులకు పండ్ల తోటలకు పందిరి సాగు చేసే రైతులకు కూడా ఆదుకోవాలి, గ్రామీణ బ్యాంకుల ద్వారా రైతులకు క్రాప్ లోన్ ఇచ్చి రైతులకు పెట్టుబడి సహాయంగా ఆదుకోవాలి,
ఈ కార్యక్రమంలో సిపిఐ తాడూరు మండల కార్యదర్శి ఎండి, కుబుద్దీన్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి కొండన్న గౌడ్,
సిపిఐ గ్రామ నాయకులు గుల్ల రవి, తిరుపతి, ఈర్ల నారాయణ, బాలయ్య దేవమ్మ, నారమ్మ గొర్ల ధర్మయ్య, తదితరులు పాల్గొన్నారు