(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం 
స్పందించిన కొల్లాపూర్ మున్సిపల్
కమిషనర్ కు “కట్టా” ధన్యవాదాలు…
కొల్లాపూర్, జూన్ 12 (నేటి సత్యం ప్రతినిధి)
ప్రజలు , వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసిన వెంటనే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకున్న కొల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ కు కొల్లాపూర్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా శ్రీనివాసులు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.
కొల్లాపూర్ మున్సిపల్ టౌన్ పాత బస్టాండ్ చౌరస్తా రామాలయం ఎదురు గా గుడిపాటి రంగయ్య షాపు ముందర మూల మలుపు లో గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ పథకం మంచినీళ్ల సరపరా కోసం సీసీ రోడ్డు ను తవ్వడం చేశారు.
పనులు పూర్తి అయినా తవ్విన సీసీ రోడ్డు సిమెంట్ శకలాలను అదే విధం గా రోడ్డుపై అడ్డం గా నిర్లక్ష్యం గా పడవేస్తూ ఉంచారు.
దీనితో ఆ రోడ్డు వెంట వెళ్లే వాహనదారులు పాదాచారులు ఆ రోడ్డు మీద ఉండే శకలాల మూలము గా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను ప్రమాదాలను సామాజిక మాధ్యమాల ద్వారా కొల్లాపూర్ మునిసిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని కట్టా శ్రీనివాసులు తెలియజేశారు.
దాని తో కమిషనర్ సకాలం లో స్పందించి తక్షణమే రోడ్డుపై ఉన్న సిసి రోడ్డు శేకలాలను తొలగించి రోడ్డును శుభ్రం చేయించడం జరిగిందని, అందుకు కొల్లాపూర్ మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాస్ కు కొల్లాపూర్ పట్టణ బిఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టా శ్రీనివాసులు ప్రజల తరపున వాహనదారుల తరపున గురువారం రోజు తన ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.