(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం.
*హక్కుల రక్షణ కోసం ప్రజా ఉద్యమాల నిర్మాణమే – అమరజీవి కామ్రేడ్ ఓంకార్ గారికి అర్పించే నిజమైన నివాళులు*
*అమరజీవి కామ్రేడ్ ఓంకార్ గారి శతజయంతి వార్షికోత్సవాలు సందర్భంగా రౌండ్ టేబుల్ లో వక్తలు*
యంసిపిఐ (యు) వ్యవస్థాపక నేత అసెంబ్లీ టైగర్ అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ గారి శతజయంతి వార్షికోత్సవాలు సందర్భంగా జూన్ 12 వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హల్ లో మధ్యాహ్నం 2 గం ల నుంచి ” పౌరహక్కుల పరిరక్షణ – ఓంకార్ గారి పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అధ్యక్షతన జరిగింది.
ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లెపు ఉపేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ నేడు దేశంలో రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సామాజిక పరిస్థితులకు పరిష్కారం కావాలని కానీ 78 సంవత్సరాలు అవుతున్న స్వాతంత్ర్య దేశంలో పౌర హక్కుల లకు రక్షణ లేదు అని అన్నారు.
ప్రశ్నించే స్వేచ్చ పౌరులకు లేకుండా పోయింది అని భారత రాజ్యాంగం లోని ఆర్టికల్స్ 14 నుంచి 18, 19 నుంచి 22, మరియు 23 నుంచి 24 లలో పొందు పరిచిన బడిన ఆరు ప్రాథమిక హక్కులు సమానత్వ హక్కు, స్వేచ్చ హక్కు, దోపిడీ కి వ్యతిరేకంగా హక్కు మత స్వేచ్చ హక్కు సాంస్కృతిక మరియు విద్యా హక్కులు భారతీయులు అందరూ భారత పౌరులు అందరూ శాంతియుతంగా తమ జీవితాలను గడపగలిగె స్వేచ్చ లకు హామీ ఇచ్చాయి. కానీ గత 75 సంవత్సరాల పాలక వర్గాల రాజ్యాంగం కల్పించిన ప్రజాస్వామిక, పౌరహక్కుల,భావ ప్రకటన స్వేచ్చను లౌకిక వాదాన్ని కాల రాసినారు.
చట్ట సవరణలతో,నల్ల చట్టాలతో ఇంకా కాల రాయడం పౌర హక్కుల హరింపే అని దీనికి వ్యతిరేకంగా పోరాట యోధుడు గా, శాసనసభ సభ్యులు గా కామ్రేడ్ ఓంకార్ గారు ఎక్కడ ప్రజా సమస్యలు ఉంటే అక్కడ ఆ సమస్యల పరిష్కారానికి పోరాడటమే హక్కుల పరిరక్షణ కు ఓంకార్ గారి కృషి గొప్పది అని అన్నారు.
కామ్రేడ్ ఓంకార్ గారు పౌరహక్కుల రక్షణలో బాగంగా ప్రభుత్వ హింసను, ప్రైవేటు హింసను, హక్కుల హరణ ను చేసె శక్తులకు వ్యతిరేకంగా రాజి లేని పోరాటం చేశారు.
అందులో బాగంగా నే ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా, రాం నర్సయ్య ఎన్కౌంటర్ కు వ్యతిరేకంగా భార్గవ కమీషన్ వేసి దోషులను నిలబెట్టిన చరిత్ర ఓంకార్ గారిది అని అన్నారు.
ఈ సమావేశానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ( టి యస్ డి యప్) రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు మాట్లాడుతూ దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న ఫాసిస్టు పాలనా లక్షణాలు, మహిళా, రైతు, కార్మిక, విద్యార్థి,యువజన, కవులు, కళాకారులు, రచయితలు, స్వేచ్చగా తమ హక్కులను ఉపయోగించు కోవడం సాద్యం కానీ నియంతృత్వ పాలనా పద్ధతులను దేశం అనుభవిస్తున్న తీరు పై యావత్ సమాజం ప్రజా ఉద్యమాలను నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు యండి అబ్బాస్, సిపిఐ (యం యల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, జేవి చలపతిరావు, సిపిఐ యం యల్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ అన్న, లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, యం యల్ పి ఐ రెడ్ ప్లాగ్ రాష్ట్ర కార్యదర్శి దొంతి రాజేష్ గారు, బి యల్ యప్ రాష్ట్ర చైర్మన్ నల్లా సూర్యప్రకాష్ గారు,
ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి గారు మాట్లాడుతూ సరైన సమయంలో పౌరహక్కుల పరిరక్షణ – ఓంకార్ గారి పాత్ర అంశంతో జరుపడం ఓంకార్ గారు అసెంబ్లీ ని, బయట పౌర హక్కుల రక్షణ కోసం చేసిన పోరాటాలు నేడు తీసుకుని ప్రజల్లో కి వెళ్ళాలని పిలుపునిచ్చారు.
ఇంకా ఈ కార్యక్రమంలో యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, కుంభం సుకన్య, గోనె కుమార స్వామి, ఏ హంస రెడ్డి, వి తుకారాం నాయక్, పెద్దారపు రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు తాండ్ర కళావతి, మా సావిత్రి, కన్నం వెంకన్న, గుండెబోయిన చంద్రయ్య, తుడుం అనిల్ కుమార్, నర ప్రతాప్,గడ్డం నాగార్జున, కంచె వెంకన్న, మేక మోహన్ రావు,ఈ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.