(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ప్రజలు దేవుళ్ళు కాలనీలు దేవాలయాలు….
చందానగర్ రైల్వే బ్రిడ్జిలో వర్షపు నీటిని తొలగించని పాలకులు.
తెలంగాణ ఎవరి పాలయింది.. ఎవరు దోచుకుంటున్నారు..?
నేటి సత్యం.చందానగర్
ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడు లేక అగమ్య గోచరంగా మారిన శేర్లింగంపల్లి నియోజక వర్గం అన్నమో రామచంద్ర అంటూ అల్లాడే రోజులు ఆసన్నమయ్యాయని బి ఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నేత మారబోయిన రవి యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు లింగంపల్లి,చందానగర్ అండర్పాస్ రైల్వే బ్రిడ్జిలలో నిలిచిన నీరును తొలగించని వైనం, రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజక వర్గంలో దాపురించింది, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు రవి యాదవ్ ప్రజలు దేవుళ్ళు కాలనీలో దేవాలయాలుగా మార్చేందుకు ముందుకు వచ్చి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఆయన సొంత డబ్బులతో రైల్వే బ్రిడ్జిలలో మర్చిపోయిన వర్షపు నీటిని లక్షల రూపాయలు వెచ్చించి బయటకి తొలగిస్తున్నారు, అయినా నిర్మాణాలు గతంలో 2009 సంవత్సరంలో కాంట్రాక్టర్లతో కుమ్ముక్కై నాసిరకం పనులు చేపట్టడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, ఇలాంటి సమస్యలను గమనించిన మారబోయిన రవి యాదవ్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ఇంతకంటే సులభమైన మార్గం ఏమీ లేదని భావించి ప్రజలే దేవుళ్ళు పల్లెలు దేవాలయాలు గా మార్చేందుకు కంకణం కట్టుకున్నారు, గత 15 రోజుల క్రితం అండర్పాస్ రైల్వే బ్రిడ్జిలో వర్షపు నీరు డ్రైనేజీ నీరు నిండిపోయిన వాన యజమానులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా నీరును తొలగించారు, అనుకోకుండా ప్రకృతి వైపర్యాల దృశ్య వరుణుడు కరుణించక అనేక ఇబ్బందులు శేర్లింగంపల్లి నియోజకవర్గం ప్రజలు ఎదుర్కొంటున్నారు, ఇన్ని సమస్యలు తలెత్తిన స్థానిక కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తుందన్నారు, సమస్యల వలయంలో పాపి రెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప, హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి పరిసర ప్రాంతాలలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న పాలకులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు, ఎన్నికల సమయంలో మాకే ఓటేయండి అని చెప్పడమే కాక ప్రభుత్వ భూములనే కాక ఆక్రమించుకోవడం వీరికి అలవాటు పడిందని స్పష్టంగా చెప్పవచ్చన్నారు, దుష్ట శక్తులను అంతమొందించడానికి ఆయన కంకణం కట్టుకొని ప్రజా సమస్యల కోసం ముందడుగు వేశారు, అనేక పనులను ఆయన సొంత డబ్బులతో చేపించడంతో ప్రజలు హారతులు పడుతున్నారు, ఆయనకు ప్రజలు చెప్పే మాటలు ఇలా ఉన్నాయి, సారు మాకు ఎమ్మెల్యే,కార్పొరేటర్ ఎక్కడ ఉంటారో తెలియదని సమాధానం చెబుతున్నారు, సమస్యలతో సతమతం అమవుతున్న కాలనీలను కాపాడటమే నా లక్ష్యమని రవి యాదవ్ ముందుకు రావడంతో కాంగ్రెస్ కార్పొరేటర్ ఎమ్మెల్యే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు గుబులు పుట్టిస్తున్నారు, ఏది ఏమైనా ఆయన ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ముందడుగు వేశారు, రాజీవ్ గృహకల్ప లో ప్రతిరోజు నీరు అందేందుకు కృషి చేస్తామన్నారు, వాటర్ ట్యాంకులను పరిశుభ్రం చేయలేక నాచు వస్తుందని ప్రజలు ఆయన దృష్టికి తీసుకురావడంతో అయ్యో మీ పరిస్థితి ఇంతగా మిగిలిపోయిందా అని కంటనీరు కార్చారు, రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచి తప్పకుండా మీ సమస్యలను పరిష్కరించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా ఇప్పిస్తానని, వాటితో పాటు స్థానిక సమస్యలను రోడ్లు డ్రైనేజీలు క్లీన్ చేపిస్తామని హామీ ఇచ్చారు, గోపి చెరువును మినీ ట్యాంక్ పండుగ మారుస్తామన్న కార్పొరేటర్ హామీలు నీతి మూటల పాలయ్యాయని అలాంటి వాటిని ప్రభుత్వంతో పరిష్కరించి నెరవేరుస్తామని చెప్పడంతో రాబోయే ఎన్నికల్లో మీరే గెలుపు పొందాలని ప్రజలు ఆయనకు మంగళ హారతులు పడుతున్నారు, దీవెనలతో ముందుకు సాగుతున్న రవి యాదవ్ ప్రజలను దేవుళ్ళుగా మార్చి అర్ధరాత్రి ఆయనకు ఫోన్ చేస్తే వచ్చి జెసిబి లతో సమస్యలను పరిష్కారం చేస్తుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు