నేటి సత్యం
*పతనం అంచున సామ్రాజ్యవాదం- ప్రపంచ దేశాల్లో యుద్ద ఉన్మాదం రెచ్చగొట్టే విదానం పై ప్రజా పోరాటాలకు సమాయత్తం కావాలి*
*యంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో*
*అఖిలభారత ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్ పిలుపు
నేటి సత్యం
. శేరిలింగంపల్లి. జూన్ 14
యంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం లు జూన్ 12,13,14 తేదీలలో హైదరాబాద్ ఓంకార్ భవన్ బాగ్ లింగం పల్లి లో కామ్రేడ్ మేక మోహన్ రావు గారి అధ్యక్షతన జరిగింది.
తొలుత సమావేశం ఇటీవల మరణించిన ప్రపంచ సిద్ది గాంచిన రచయిత గుగువా థియాంగో గారికి, యుద్ధాల్లో మరణించిన వారికి, ఉగ్రవాద దాడులతో మరణించిన వారికి, ప్రకృతి వైపరీత్యాలలో మరణించిన వారికి సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించనైనది
అనంతరం సమావేశం నకు ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ గారు మాట్లాడుతూ నేడు ప్రపంచానికి సామ్రాజ్య వాదం, పెట్టుబడి దారీ వ్యవస్థే ప్రత్యామ్నాయం అని బాకా ఊదిన నేడు
సామ్రాజ్య, పెట్టుబడి దారీ వ్యవస్థ పతనం అంచున చేరింది అని దాన్ని పక్క దారి పట్టించేందుకు తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి యుద్ధ వాతావరణం సృష్టించిన తీరు తమ దోపిడీ ఆధిపత్యం కోసమే అని ఇది గమనించినప్పుడు ప్రపంచం ముందు పతనం అవుతున్న సామ్రాజ్య వాదం, పెట్టుబడిదారీ వ్యవస్థ సరైన ప్రత్యామ్నాయం సోషలిస్టు ఆర్థిక వ్యవస్థే సరైన ప్రత్యామ్నాయం అని సోషలిజం లోనే ప్రజలకు సుఖ సంతోషాలతో జీవించే రాజ్యం ఏర్పడుతుంది అని అన్నారు, శ్రీ లంక పరిణామాలు దానికి నిదర్శనం అని అన్నారు.
దేశంలో నేడు బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ వర్గాల ప్రయోజనం కోసం మతోన్మాదం రెచ్చగొట్టి సెక్యులర్ రాజ్యాంగ విద్వంసం నకు పూనుకోవడం జరుగుతున్న తీరు, అందుకోసం కౄర చట్టాలను రూపొందించడం, మద్య భారతంలో ఆదివాసి ఖనిజ సంపదను దోపిడీ చేసి వనరులను కొల్లగొట్టెందుకు ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసుల పై కేసులు పెట్టడం ఎన్కౌంటర్ ల పేరుతో చెప్పడం వామపక్ష ప్రజా ఉద్యమాలను అణిచివేత కు గురిచేయడం కార్పోరేట్ వర్గాల ప్రయోజనం కోసమే అని ఇది దేశ ప్రజలకు అభివృద్ధి కి, ప్రజా మనుగడకు ఎనలేని కష్టం కలుగుతుంది అని దీనికి వ్యతిరేకంగా కార్పోరేట్ ఆర్థిక విధానాల కు, నియంతృత్వ విధానాలకు పీడిత ప్రజా ఉద్యమాల నిర్మాణం కోసం కమ్యూనిస్టు వామపక్ష, సామాజిక శక్తుల ఐక్యత కోసం యంసిపిఐ(యు) శ్రేణులు నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
*యంసిపిఐ (యు)* *రాష్ట్ర కమిటీ నిర్ణయాలు*
*గాదగోని రవి* *రాష్ట్ర కార్యదర్శి*
1) రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేయాలని , ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లో అర్హులకు కెటాయించాలి.
2) పోడు రైతులకు భూ బారతి పట్టాలు ఇవ్వాలి
3) పేద ప్రజల ఇండ్లు ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలి. అని జూన్ 28 వ తేదీన మండల కేంద్రము లలో తహసీల్దార్ కార్యాలయం ల ముందు ధర్నాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
యంసిపిఐ (యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ ఓంకార్ గారి శతజయంతి వార్షికోత్సవాలు సందర్భంగా జూలై 12 వ తేదీన రైతాంగ పోరాటాలు – ఓంకార్ గారి పాత్ర అనే అంశంపై రాష్ట్ర రైతాంగ సదస్సు జరుపాలని నిర్ణయం జరిగింది. కామ్రేడ్ ఓంకార్ గారి శతజయంతి వార్షికోత్సవ కార్యక్రమాల ను సంవత్సరం పాటు ప్రజా సమస్యలపై నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ సమావేశం లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్, గోనె కుమారస్వామి, కుంభం సుకన్య, హెన్ రెడ్డి హంసా రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె మల్లేష్, తుడుం అనిల్ కుమార్, కర్రోళ్ళ శ్రీనివాస్, మాస్ సావిత్రి, కర్ర రాజిరెడ్డి, అంగడి పుష్ప తదితరులు పాల్గొన్నారు.