నేటి సత్యం

*శేరిలింగంపల్లి బి.సి సంఘం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, హరిశంకర్ గౌడ్ లకు సంపూర్ణ మద్దతు తెలిపిన*
*-అధ్యక్షులు బండారి రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ*
శేరిలింగంపల్లి, జూన్ 14 ( నేటి సత్యంప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన బిసి సంఘం అధ్యక్షులు అడ్వకేట్ బండారి రమేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పటేల్ కృష్ణ అధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని, తెలంగాణ బీసీ పోలిటికల్ జెఏసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ లని కలిసి బి.సి ఉద్యమాన్నికి సంపూర్ణ మద్దతుగా ఉంటామని తెలియజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. డివిజన్ ల వారిగా కమిటి వేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. బీసీ ల రాజ్యాధికార కోసం చేసే పోరాటంలో మీరందరూ ముందు వరుసలో ఉండాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ పోలిటికల్ జెఏసి నాయకులు బందారపు నర్సయ్య, బీసీ నాయకులు నిజాంపేట మాజీ ఎంపీటీసీ కె.సురేష్ యాదవ్, శేరిలింగంపల్లి మహిళా కో ఆర్డినేటర్ కె లలిత రాణి, శేరిలింగంపల్లి ఉపాధ్యక్షులు ఏం.నర్సింగ్ మదిరాజ్, కొండాపూర్ బీసి సంఘం అధ్యక్షురాలు బి.విజయలక్ష్మి, కొండాపూర్ ప్రధాన కార్యదర్శి వై రాజు, సెక్రెటరీ శ్రీనివాస్ ఎస్. 111డివిజన్ అధ్యక్షురా లు యు.సంగమ్మ, ఈసీ మెంబెర్ జి.మంగు బాయి, తదితరులు పాల్గొన్నారు.