(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఆపరేషన్ కగార్ ను వెంటనే నిలిపివేయాలి మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్
.
ఆపరేషన్ కగారు వెంటనే నిలిపివేయాలి మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించాలి కాల్పుల విరమణ చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన గోడపత్రికలను నేడు శంషాబాద్ మండల కేంద్రంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు కే రామస్వామి జిల్లా కార్యవర్గ సభ్యులు టి రామకృష్ణ భారతరాజు నరసింహ శంషాబాద్ మండల కార్యదర్శి నర్ర గిరి జిల్లా సమితి సభ్యుడు కే చంద్ర యాదవ్ ఇతర నాయకులతో కలిసి గోడపత్రికలను విడుదల చేయడం జరిగింది
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండకరణ్యం అడవిలో నల్లగుట్టలో ఆపరేషన్ కగార్ కొనసాగుతున్నదని 2000 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం లక్ష్యంగా కేంద్ర బలగాలు చుట్టుముంటాయని తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు నిర్వహించి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఆయన డిమాండ్
ఈ అంశం పైన జూన్ 17న మంగళవారం నాడు ఇందిరాపాలు మహాధర్నా కార్యక్రమం శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నదని రంగారెడ్డి జిల్లా నుండి వందలాదిమంది కార్యకర్తలు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు
ఈ పోస్టర్ విడుదల కార్యక్రమం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ మహిళా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల ఇన్సాబ్ సంఘం జిల్లా అధ్యక్షుడు మీనాక్షి తదితరులు పాల్గొన్నారు