(adsbygoogle = window.adsbygoogle || []).push({});

చలో ఇంద్ర పార్క్. బాత రాజు
సరూర్నగర్. నేటి సత్యం. జూన్ 16
*ఆపరేషన్ కగార్ ను ఆపాలని డిమాండ్ చేస్తూ గోడ పత్రికను విడుదల చేయడం జరిగినది రేపు ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేసిన మహా ధర్నాను విజయవంతం చేద్దాం*
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ సరూర్నగర్ మండల కార్యదర్శి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నర్సింహ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ వారు మాట్లాడుతూ
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా రేపు 17 జూన్ నాడు ఇందిరా పార్క్ లో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ దేశంలో మావోయిస్టులను ఏరివేత పేరుతో చంపుతాం అని బహిరంగంగా ప్రకటించడం రాజ్యాంగం కల్పించిన మనిషి జీవించే హక్కును కాలరాయడమేనని,చర్చలు జరపడానికి సిద్ధం అని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని,ఇతర దేశాలతో చర్చలు జరపడానికి సిద్దమైన ప్రభుత్వం,స్వంత పౌరులతో చర్చలు జరపకపోవడం బీజేపీ దుర్నితిని తెలియచేస్తుందన్నారు.ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులను అంతంచేయడానికి పూలుకుంది అని ఖనిజాలను అడవులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడానికి పర్యావరణం ను కాపాడుకోవాలంటే ఆపరేషన్ కాగార్ ను ఆపాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ ఎండి ఫైమీద సిపిఐ సరూర్నగర్ మండల సహాయ కార్యదర్శి బోయపల్లి రాములు గౌడ్ సిపిఐ నాయకులు లింగయ్య గౌడ్ యాదయ్య నర్సింగ్ నాగరాజు ఎల్లయ్య మదిలేటి పురుషోత్తం శ్రీనివాస్ రెడ్డి వెంకన్న తదితరులు పాల్గొన్నారు