*పాలస్తీనా – ఇరాన్ లపై యుద్ద దాడులు అమెరికా సామ్రాజ్యవాద కుట్రలో భాగమే*
*ఇజ్రాయిల్ ను – ఉక్రేనియన్ ప్రోత్సాహి స్తున్న – అమెరికా బారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది*
*ప్రజా సమస్యలపై పోరాటాలను ఉదృతం చేయాలి*
*యంసిపిఐ (యు) గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీ సమావేశంలో*
*రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు*
——————————-
ది:-16-6-2025 రోజున యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ జిల్లా కమిటీ సమావేశం మియాపూర్ యం ఎ నగర్ ఆపీసు లో కామ్రేడ్ కర్ర దానయ్య గారి అధ్యక్షతన జరిగింది
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి గారు మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ విధానం సంక్షోభం లో చిక్కు కొని ఆ విధానం అనుసరిస్తున్న అమెరికా అనేక ఆర్థిక సమస్యలతో అంతరంగిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాల పై ఆర్థిక సుంకాలు, ట్యాక్సీలు విధిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆంతరంగిక సమస్యలను ఎగదోసి, సరిహద్దు దేశాలతో సమస్యలను ఎగదోసి సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు యుద్ధ వాతావరణం కల్పించి యుద్దాలు చేస్తున్న
తీరు భారత దేశం – పాకిస్తాన్ సమస్య, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం
ఇజ్రాయిల్ – పాలస్తీనా గాజా యుద్ధ సమస్య, నేడు ఇజ్రాయెల్ ఇరాన్ పై సాగిస్తున్న యుద్ధ దాడులు యావత్ సామ్రాజ్య వాద, పెట్టుబడి దారీ దేశాలు పేద, వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలలో దోపిడీ ని పెంచి పోషిస్తున్న తీరు అంతర్గత సమస్యలను పోషించి నేడు పతనం చెందుతున్న తీరు తో యుద్ధాలను ఎగదోయటం జరుగుతుంది అని ఆ క్రమంలోనే నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు దెబ్బ తింటున్న సామ్రాజ్యవాదం – పెట్టుబడి దారీ వ్యవస్థ ను తేటతెల్లం చేస్తుంది అని దీనికి ప్రత్యామ్నాయం సోషలిస్టు వ్యవస్తె తప్ప ఈ పెట్టుబడి దారీ, సామ్రాజ్య వాద వ్యవస్థ కాదని అందుకు అనుగుణంగా ప్రపంచ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి అని, ప్రజలు ప్రజా ఉద్యమాల ద్వారా ఈ దోపిడీ పెట్టుబడి దారీ వ్యవస్థ ను కూల్చాలని పిలుపు నిచ్చారు.
దేశంలో బిజెపి గత పదకొండు సంవత్సరాల పాలనలో దేశాభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పని చేయకుండా విద్వేష రాజకీయాలను, మతోన్మాద రాజకీయాలను చేస్తున్న తీరు తో ప్రపంచం ముందు తలవంపుల పాలు కావడం జరుగుతుంది అని దీనికి వ్యతిరేకంగా పీడిత ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు.
యంసిపిఐ ( యు) వ్యవస్థాపక నేత అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ గారి శతజయంతి వార్షికోత్సవాలలో బాగంగా జూన్ 20 నుంచి జిల్లా వ్యాప్తంగా పౌరహక్కుల పరిరక్షణ – ఓంకార్ గారి పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం లు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని జూన్ 28 వ తేదీన తహసీల్దార్ ఆపీసు ల ముందు పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలని నిర్ణయించింది
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలపై అనుసరిస్తున్న సాచవేత విధానానికి వ్యతిరేకంగా గ్రామ, వార్డు స్తాయి లో ప్రజా ఉద్యమాలను పెద్ద ఎత్తున నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశం లో యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్, జిల్లా సహయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, కమిటీ సభ్యులు కుంభం సుకన్య, వి.తుకారాం నాయక్,తాండ్ర కళావతి, పి . భాగ్యమ్మ, అంగడి పుష్ప, టి. నారాయణ, విమల , యల్. రాజు, వై, రాంబాబు, పి. శ్యాంసుందర్, ఇస్లావత్ దశరత్ నాయక్ తదితరులు
పాల్గొన్నారు.