(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*పేద రైతు కళ్ళల్లో ఆనందం*
U
*రంగారెడ్డి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి రోహిత్ రెడ్డి*
తెలంగాణ రాష్ట్ర రథసారథి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ రైతు అనేవారు సుఖంగా ఉంటేనే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుందని రంగారెడ్డి జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమిడి రోహిత్ రెడ్డి అన్నారు. శ్రీ రంగాపూర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిన్నటి వరకు రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,87,435 రైతులకి 127, 88, 97,261 డబ్బులు జమ అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. నమ్మిన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఈరోజు రైతు భరోసా ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా అర్హులైన వారికి అమలు చేయడం జరుగుతుంది అని భీమిడి రోహిత్ రెడ్డి అన్నారు. దేశంలోనే ఒకేసారి రెండు లక్షలకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేక రైతులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రుణమాఫీ జరిగిన తరువాత ఎంతో ఆనందంతో ప్రజా ప్రభుత్వాన్ని మెచ్చుకోవడం జరుగుతుందనీ తెలిపారు. దీని చూసి ఓర్వలేక పోతున్నారు టిఆర్ఎస్ నాయకులనీ విమర్శించారు. ప్రతి రైతు సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రానున్న రోజుల్లో మరింత మేలైన విధంగా పరిపాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొందుర్గు మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు కాగుల శివరాజ్ యాదవ్ నాయకులు నర్సింలు, ప్రదీప్ హరి మరియు రైతులు పాల్గొన్నారు.. KP