(adsbygoogle = window.adsbygoogle || []).push({});
శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు..
గన్నేరువరం నేటి సత్యం న్యూస్ :
జూన్ 19 (ముడికే రమేష్ యాదవ్)
గన్నేరువరం మండల కేంద్రంలో యాదవ కులస్తులు గురువారం ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు నిర్వహించారు. గ్రామంలోని యాదవ మహిళలందరూ తలపై బోనం ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ శివ సత్తుల పూనకాలతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకొని బోనాలలో తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని గ్రామంలో పంటలు బాగా పండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు. గ్రామంలోని యాదవ మహిళలందరూ పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.