(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు
సుగుణమ్మ గారి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు*
శేర్లింగంపల్లి. నేటి సత్యం. జూన్ 19
*యంసిపీఐ(యు)జాతీయ కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్*
*మియాపూర్ లో ప్రశాంత్ నగర్ వారి నివాసంలో యంసిపిఐ (యు )పార్టీ రాష్ట్ర నాయకత్వంతో కలిసి ఆమెకు నివాళులర్పించారు*
తదంతరం యంసిపీఐ(యు )జాతీయ కార్యదర్శి కామ్రేడ్ మద్ది కాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ సుగుణమ్మ గారు తన 15 వ ఏటనే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం పొంది. నాడు సాగిన దొరలు, భూస్వాములు, పెత్తందార్ల వెట్టిచాకిరి కి వ్యతిరేకంగా బాంచన్ కాల్మొక్తా అనే సామాన్య ప్రజల చే ఆయుధం పట్టించి ఆత్మగౌరవ పోరాటం నిర్వహించి పది లక్షల ఎకరాల భూమిని పంచి , మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాల ఏర్పాటు చేసిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రధాన భూమిక పోషించిన నాయకత్వం యొక్క రక్షణ కేంద్రం నిర్వహణ సభ్యురాలు గా ఉండి అనేక సాహస కార్యక్రమాలకు నేతృత్వం వహించిన సుగుణమ్మ గారి కుటుంబం యావత్తు సాయుధ పోరాట వారసత్వం కావటం.
ఆ పోరాటంలో అగ్రశ్రేణి పాత్ర నిర్వహిస్తూ ఉన్న కామ్రేడ్ శాఖమూరి వెంకట కృష్ణ ప్రసాద్ ( యస్ వి కే ప్రసాద్) గారిని 1949 లో పోరాట సందర్బంగా నే వివాహం చేసుకున్న వీరు పోరాట విరమణ తరువాత ప్రజా ఉద్యమాల్లో కీలకమైన పాత్ర నిర్వహించారు. శాసనసభ ఎన్నికలలో చెన్నూరు నియోజకవర్గం నుంచి కామ్రేడ్ యస్ వి కే ప్రసాద్ గారు గెలుపొందడం ఆనాటి ఉద్యమ నేతలను ప్రజలు అక్కున చేర్చుకున్న తీరు అమోఘం.
1984 ఫిబ్రవరి 18 వ తేదీన వరంగల్ నగరంలో చారిత్రాత్మక మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ( యంసిపి)
ఆ తర్వాత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ( యంసిపిఐ) ఏర్పాటు లో వ్యవస్థాపక కామ్రేడ్ సుగుణమ్మ నాటి ఐక్య మహిళా సమాఖ్య తొలి అధ్యక్షురాలు గా బాధ్యతలు నిర్వహిస్తూ
1984 ఆగష్టు మాసంలో నాటి ఉమ్మడి ముఖ్యమంత్రి గా ఉన్న యన్ టి రామారావు ప్రభుత్వం ను నాటి నాదెండ్ల భాస్కరరావు ను అడ్డుపెట్టుకుని గవర్నర్ వ్యవస్తను దుర్వినియోగం చేసి రాంలాల్ అనే గవర్నర్ తో ప్రభుత్వం కూల్చివేత కు పాల్పడగా పార్టీ పిలుపు నందుకొని సాగిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటంలో పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకురాలు గా కామ్రేడ్ సుగుణమ్మ ప్రభుత్వ పునరుద్ధరణ వరకు సాగిన పోరాటం లో మహిళలందరి ని సమీకరించి ఉద్యమించారు.
ఇలా ప్రజా ఉద్యమాలలో సముచిత పాత్ర నిర్వహించిన సుగుణమ్మ గారు జూన్ 16 వ తేదీన రాత్రి మరణించటం పట్ల యంసిపిఐ(యు) ప్రధాన నాయకత్వం విప్లవ జోహార్లు అర్పించారు.సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కే.నారాయణ గారితో కలిసి నివాళులర్పించిన వారిలో యంసిపీఐ(యు) పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గదాగోని రవి, కార్యదర్శి వర్గ సభ్యులు వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్, పస్కుల మట్టయ్య, గోనె కుమార స్వామి, ఏ.హంసారెడ్డి,పెద్దాపురం రమేష్, తుకారం నాయక్, మంద రవి,కే సుకన్య, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి మైదం శెట్టి రమేష్, తాండ్ర కళావతి, ఇస్లావత్ దశరథ్ నాయక్,పి భాగ్యమ్మ, కర్ర దానయ్య, బి విమల, శివాని తదితరులు ఉన్నారు.