(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం
పాలస్తీనకు సంఘీభావంగా నిలబడాలి
ఇజ్రాయిల్ దాడులను ఆపాలి –
ప్రపంచ శాంతిని కాపాడాలి
Aipso రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కే వి ఎల్ పిలుపు
పాలసీన ఇరాన్ దేశాలపై చేస్తున్న దాడులను యుద్ధాలను ఒకరేయిన్ రష్యాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని సామ్రాజ్యవాద యుద్ధం మాత దేశాలు వెంటనే ఆపాలని ప్రపంచ శాంతిని కాపాడాలని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ ఐక్యరాజ్యసమితిని సమితిని కోరారు.
కొన్ని దశాబ్దాలుగా ఇప్పటికే ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల వలన పాలస్తీనా వేలాదిమంది ప్రాణాలను కోల్పోయిందని చిన్నారుల భవిష్యత్తును చిదివేసిందని, విద్యాలయాలు వైద్యశాలలో పరిశ్రమలు అన్ని దెబ్బతిన్నాయని ప్రాణ నష్టం విపరీతంగా జరిగిందని అన్నారు పైగా ఇటీవల ఇరాన్ పై కూడా ఇజ్రాయిల్ రుచుకుపడుతుందని కేపీఎల్ తెలియజేశారు ఈ యుద్ధాలు ఎవరు చేసినా దేశాలు విధ్వంసమతాయని ప్రజలు నాగరికత బూడిద పాలవుతుందని భవిష్యత్తు అంధకారం అవుతుందని అందుకే యుద్ధాలు నువ్వు వెంటనే ఆపాలని ప్రపంచ శాంతిని కాపాడాలని రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేపీఎల్ కోరారు.
అఖిలభారత సంఘీభావ సంఘం కమిటీ పిలుపు మేరకు అనగా 2025 శుక్రవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో ఐ షో ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు గౌన్లు ధరించి ఇజ్రాయిల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా, పాలసీనాకు సంఘీభావంగా అడ్వకేట్స్ ఫర్ పీస్ అంటూ ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటూ యుద్ధం వద్దు మానవ ప్రగతి కావాలి అంటూ ప్రదర్శన నిర్వహించారు అనంతరం కోర్టు బయటి గేటు ద్వారం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా కోర్టు బారసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ మేధావులంతా యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కొరకు నిలబడాలన్నారు.
అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బాసెట్టి కార్తీక్ మాట్లాడుతూ పాలస్తీనా ప్రజలకు న్యాయం జరగాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం నాయకులు, రమణారావు, విష్ణువర్ధన్ రెడ్డి ,శాంతి సంఘం నాయకులు డి .శ్రీనివాస్ బి. లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రపంచ ప్రజల జీవితాలను కాపాడాలన్నారు. రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కిషోర్ , ప్రముఖ న్యాయవాదులు కే .వీరబాబు, జూపల్లి కృష్ణారావు నల్లబోతు సత్యనారాయణ రెడ్డి ,జీవన్, నిర్మల, జ్యోతి ,కర్ణం ప్రశాంత్, నారాయణ ,వేణుగోపాల్ రెడ్డి , తదితరులు పాల్గొని యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతి ఉద్యమం బలోపేతం కావాలని మాట్లాడారు.