(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*అక్రమ సెల్లార్ల తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి:సిపిఐ*
సరూర్ నగర్: జూన్ 20 నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న:
సిపిఐ సరూర్నగర్ మండల సమితి ఆధ్వర్యంలో ఎస్ ఏ డాంగే భవన్లో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. సిపిఐ సరూర్నగర్ మండల కార్యదర్శి రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బాతరాజు నరసింహ హాజరై మాట్లాడుతూ.. ఆర్.కె.పురం డివిజన్లో అక్రమ సెల్లార్ల తవ్వకాల నిర్మాణాలను విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని గత వారం కింద ప్రజాపాల నలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కి కమిషనర్ కి వాసవి కాలనీలో నిర్మిస్తున్నటువంటి డబల్ సెల్లార్ కు సంబంధించినటువంటి కంప్లైంట్ ను ఇవ్వడం జరిగినది దానిపైన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని రోడ్డు పక్కనే ఉన్నటువంటి సైట్ లో డబల్ సెల్లార్ తొవ్వడం కారణంగా పక్కనే ఉన్నటువంటి గృహాలకు రోడ్డుపైన నడుచుకుంటూ వెళ్లే ప్రజలకు పక్కన అటు ఇటు కాలేజీలు స్కూలు అన్నింటిని వదిలేసి ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ చేస్తూ టిప్పర్లతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఇష్టానుసారంగా వివరిస్తున్న యజమాన్యం పైన చర్య తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. డివిజన్లలో అనేక సెల్లార్లు ఎలాంటి భద్రత లేకుండా విచ్చలవిడిగా తవ్వుతూ నానా బీభత్సం సృష్టిస్తున్న చూసి చూడనట్టు వదిలేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల పైన పై అధికారులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైనా జరగరాని సమస్య జరిగినప్పుడే హడావుడి చేసి తర్వాత శర మామూలు అన్నట్టే విధంగా వదిలేస్తున్నారని దీనిపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ దృష్టి కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ తవ్వకాల సెల్లార్ల గురించి వినతిపత్రం కూడా ఇస్తామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ సరూర్నగర్ మండల సహాయ కార్యదర్శి బోయపల్లి రాములు గౌడ్ ఏఐటీయూసీ ఎల్బీనగర్ నియోజకవర్గం కార్యదర్శి రమావత్ సక్రు నాయక్ పాల్గొనడం జరిగింది.