- నేటి సత్యం నాగర్కర్నూల్ జిల్లా 23 03 2025 సోమవారం
ప్రజా ఉద్యమాల ఊపిరి, సిపిఐ ఎర్రజెండా,
సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం బాల నరసింహ
ప్రజా సమస్యలపై ప్రతిఘటన పోరాటాలకు కార్యకర్తలు శ్రేణులు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల నరసింహ పిలుపునిచ్చారు.

సోమవారం నాడు బిజినపల్లి మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 18వ, మండల మహాసభ సందర్భంగా డాక్టర్ బి.ఆర్, అంబేద్కర్ విగ్రహం కాడ పార్టీ జెండా ఏం బాల నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెండాను ఎగరవేశారు, అనంతరం ఎం జె ఆర్ ఫంక్షన్ హాల్
వరకు ర్యాలీనిర్వహించారు, కామ్రేడ్ బాల నరసింహ ఆవిష్కరించారు.
అనంతరం బిజినపల్లి మండల కేంద్రంలో జరిగిన 18వ, మండల మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా ఎం బాల నరసింహ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాల్గొని మాట్లాడారు. దేశంలో బిజెపి అధికారం చేపట్టిన తర్వాత మత ఘర్షణలు పెట్టరేగిపోయి మతసామరస్యానికి ఆటంకంగా ప్రమాదకరంగా మారాయి అన్నారు. నల్లధనం వెలికితీత, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అమలు, ధరలను నియంత్రణ అన్నింటినీ గాలికి మోడీ సర్కార్ వదిలేసిందన్నారు. నిరంతరం ప్రజల పక్షాన పోరాడేది భారత కమ్యూనిస్టు పార్టీ ఒక్కటేనని ఆయన చెప్పారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. బిజెపి పాలిత రాష్ట్రాలలో దళితులు మహిళలు మన ప్రాణాలకు రక్షణ కరువైందని అలాగే ఇటీవల మిషన్ గర్ పేరున హింసకాండ కు పాల్పడుతూ మావోయిస్టులను దారుణంగా హమారుస్తుందని, చెంచు గిరి జనులను హత్య చేస్తుందని అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయించి ఆ సంపదను వేల కోట్ల రూపాయలు చేసే విలువైన సంపదను ఆదాని అంబానీలకు నిస్సిగ్గుగా కట్ట పెడుతుంది అన్నారు. దేశంలో ఇప్పటికీ 40% పైగా ప్రజలకు సెంటు భూమిలేదన్నారు. ఒకనాడు కమ్యూనిస్టు పార్టీ పోరాడు కాంగ్రెస్ మెడలు వంచి గైరాన్ సీలింగ్ భూములను పేదలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం, అటవీ హక్కుల సంరక్షణ చట్టం కమ్యూనిస్టు పార్టీ సాధించి వేయనని ఆయన పేర్కొన్నారు. దేశం కి రాష్ట్రానికి బిజెపి విధానాలు అతి ప్రమాదకరంగా తయారైనయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ సర్కార్ విధానాలు కొనసాగుతున్నాయని వీటిని ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలుపరచడం లేదన్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇలా 6 గ్యారంటీలన్నీ ఏవి సక్రమంగా అమలు పరచకుండా పక్కన పెట్టిందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులందరికీ ఇవ్వాలని, కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని, కొత్తగా పింఛన్లు ఇవ్వాలని, పెంచి ఇస్తామన్న హామీని అమలు పరచాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు ఒకటి రెండు తేదీలలో కల్వకుర్తి పట్టణంలో సిపిఐ జిల్లా మహాసభలు నిర్వహించి తలపెట్టినట్లు వాటి జయప్రదానికి ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని కృషి చేయాలని తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హెచ్ ఆనంద్ జి, వార్ల వెంకటయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈర్ల,చంద్రమౌళి, టీ నరసింహ,, ఈర్ల చంద్రమౌళి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మారేడు శివశంకర్, సిపిఐ మండల కార్యదర్శి పి ,కృష్ణ జీ , ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి మల్లేష్, ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు కేసుమోల్ల శివకృష్ణ, సిపిఐ మండల తదితరులు పాల్గొన్నారు.