*వరదముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరిస్తాం* పి ఎస్సీ చైర్మన్. ఎమ్మెల్యే. ఆర్కపూడి గాంధీ 
నేటి సత్యం. శేరిలింగంపల్లి. జూన్ 24
*వరద ముంపు సమస్య నుండి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు.. నాలా పనులపై భయందోళనలో ఉన్న స్థానికప్రజలకు జరుగుతున్న పనులను పర్యవేక్షించి సమస్య లేకుండా ప్రజలకు మేలు జరిగేలా నాలా పనులను నిర్మించాలని అధికారులను ఆదేశించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*శేరిలింగంపల్లి డివిజన్ లోగల తారనగర్ సాయి బాబా దేవాలయం వద్ద రూ.28 కోట్ల 45 లక్షల రూపాయలతో నల్లగండ్ల చెరువు నుండి బి హెచ్ ఈ ఎల్ చౌరస్తా గ్యాస్ గోడౌన్ నాల వరకు నాల విస్తరణ పనులలో భాగంగా నిర్మిస్తున్న ఆర్ సి సి బాక్స్ డ్రైన్ నిర్మాణం పనులను, ఆర్.సీ.సీ బెడ్, సైడ్ వాల్స్ నిర్మాణం మరియు నాల విస్తరణ నిర్మాణం పనులను గౌరవ ఎమ్మెల్యే శ్రీ అరేకపూడి గాంధీ గారు, SNDP విభాగం అధికారులతో కలిసి పరిశీలించిన గౌరవ శేరిలింగంపల్లి రాగం నాగేందర్ యాదవ్ గారు.*
*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలా విస్తరణ పనులకు స్థానికవాసులు సహకరించాలని, ఒకప్పుడు వరదలు వస్తే కంటిమీద కునుక్కు లేకుండా ప్రజలు తీవ్ర ఆందోళనతో ఇబ్బందులకు గురయ్యేవారని కానీ నేడు సమస్య లేకుండా మళ్లీ పునరావృతం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని ముంపు ప్రాంతాలకు ఉపశమనం లభించిందని ప్రజా అవసరాల దృశ్య ప్రథమ ప్రాధాన్యతలో విస్తరణ పనులు చేపట్టాలని నాలాల విస్తరణ పనులలో వేగం పెంచాలని యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, తదితర అసోసియేషన్ మెంబర్స్, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.*