Neti Satyam
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 1:50 pm Editor : Admin

ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడిని ఖండిస్తున్నాం ప్రపంచ శాంతిని నెలకొల్పదం జంగయ్య




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడి నీ ఖండిద్దాం ప్రపంచ శాంతిని నెలకొల్పుదాం

సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య

నేటి సత్యం. కొత్తూరు. జూన్ 24

.. ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాద దాడిని తీవ్రంగా ప్రతిఘటిద్దాం ప్రపంచ శాంతిని నెలకొల్పుదాం అని సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య పిలుపునిచ్చారు

సోమవారం నాడు సిపిఐ పార్టీ కొత్తూరు మరియు నందిగామ మండల మహాసభ కొత్తూరు మండల పరిధిలోని జెపి దర్గాలో మామిడి శేఖర్ రెడ్డి గడ్డం జగదీష్ అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యకర్తలను దేశించి మాట్లాడారు

అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై కర్ర పెత్తనం చేస్తూ ఖనిజ సంపద ఇంధన సంపదపై పెత్తనం సాధించడానికి అమెరికా చేస్తున్న ఈ దాడిని ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్యవాదులు ఈ దాడిని ఖండించాలని ఆయన అన్నారు

ఇజ్రాయిల్ పాలస్తీనా గాజానగరం పై నిర్విరామంగా చేస్తున్న దాడి అమెరికా వత్తాసుతోనే జరుగుతుందని మొత్తం ప్రపంచ వర్తమాన దేశాల పైన జరుగుతున్న ఈ దాడిని ప్రపంచ శాంతి కోరే వారు ఈ దాడులను ఖండించాలని ఆయన హితవు పలికారు

సిపిఐ పార్టీ 19 25 డిసెంబర్ 26న భారతదేశంలో ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు అవుతుందని దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మండల మహాసభలు జరుగుతున్నాయని మహాసభల అనంతరం గ్రామ గ్రామాన శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు

రాబోయే కాలంలో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిరుపేదలను గుర్తించి ప్రభుత్వ భూములలో మరియు భూదాన భూములలో ఇళ్ల స్థలాల కోసం గుడిసెలు వేయించి భూ పోరాటాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు జిల్లా కార్యదర్శి జంగయ్య పిలుపునిచ్చారు

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పానుగంటి పర్వతాలు కే రామస్వామి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద సిపిఐ పార్టీ కార్యకర్తలు ఆందోళన పోరాటాలు నిర్వహించాలని వారు అన్నారు ఈ మహాసభ లో తీసుకున్న కర్తవ్యాలు తీర్మానాలపైన భవిష్యత్తులో ఆందోళన పోరాటాలు మరింత ఉదృతం చేసి సిపిఐ పార్టీని విస్తరించడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని వారు అన్నారు

నూతన కమిటీ ఎన్నిక

కొత్తూరు మండల కార్యదర్శిగా ఎండి షటిల్ సహాయ కార్యదర్శిగా ఎం శేఖర్ రెడ్డి రోజా ఎన్నికయ్యారు వీరితోపాటు 15 మంది కార్యవర్గం కౌన్సిల్ ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకున్నది

నందిగామ మండల కార్యదర్శిగా గడ్డం జంగయ్య సహాయ కార్యదర్శులుగా రాఘవేందర్ గడ్డం జగదీష్ 9 మంది కమిటీ సభ్యులుగా మహాసభ ఏకగ్రీవంగా ఎన్నిక అయిందని

సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమకుల రంగయ్య ప్రకటించారు

ఈ మహాసభలో మహిళా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల ఇన్ సాబ్ సంఘం జిల్లా అధ్యక్షుడు మార్బుల్ మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సక్రు నాయక్ మండల కార్యదర్శులు ఎండి షకిల్ గడ్డం జంగయ్య సంజీవ కుమార్ జంగయ్య అజ్మతలి మహమ్మద్ హుస్సేన్ తాహెర్ తదితరులు పాల్గొన్నారు