(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*వెంకటేశ్వర యాచరీస్ కార్మికులు అడుగుతున్న న్యాయమైన కోరికలను తక్షణమే పరిష్కరించాలి*
*పానుగంటి పర్వతాలు డిమాండ్*
నేటి సత్యం శంషాబాద్. జూన్ 26
వెంకటేశ్వర యాచరీస్ కార్మికుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు డిమాండ్
ఫరూక్నగర్ మండల పరిధిలోని వెలిజర్ల వెంకటేశ్వర యాచరీస్ పరిశ్రమ లో పనిచేస్తున్న కార్మికులు గత పది రోజులుగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సామరస్య పూర్వకంగా ధర్నా చేస్తున్నారు వారిని భయభ్రాంతులకు చేయడానికి యాజమాన్యం కుట్రపూరితమైన వాతావరణాన్ని సృష్టించడం సరైన పద్ధతి కాదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పానుగంటి పర్వతాలు జిల్లా ఉపాధ్యక్షుడు ఎం శ్రీను గురువారం నాడు ఒక ప్రకటనలో అన్నారు.గత 20 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు సరైన కనీస వేతనాలు ఈఎస్ఐ.పిఎఫ్ బోనస్ గ్రాట్యుటీ లాంటి చట్టాలను అమలు చేయకుండా కార్మికుల యొక్క శ్రమను దారుణంగా దోచుకోవడం బాధాకరమని ఆయన విమర్శించారు
కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్న వెంకటేశ్వర యాచరీస్ పైన చర్యలు తీసుకోవాలి.