Neti Satyam
Newspaper Banner
Date of Publish : 27 June 2025, 1:17 pm Editor : Admin

భూధన భూములు కబ్జాదారుల నుండి కాపాడాలి సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ .భూదాన భూములు భూ కబ్జాదారుల నుండి వాటిని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్*

నేటి సత్యం మహేశ్వరం. జూన్ 27

.. రోజురోజుకు ప్రభుత్వ భూములు మరియు భూదాన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని భూ కబ్జాదారుల నుండి వాటిని కాపాడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్ చేశాడు

శుక్రవారం నాడు మహేశ్వరం పట్టణంలోని SVJ కన్వెన్షన్ హాల్ లో జరిగిన సిపిఐ 12వ మహేశ్వరం మరియు కందుకూరు మండల మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూములు మరియు భూదాన భూములు ఇతర మిగులు భూములో అసైన్డ్ భూములు వేలాది ఎకరాలు ఉన్నాయని ప్రభుత్వం పర్యవేక్షణ లేకపోవడం వల్ల భూ కబ్జాదారులు యదేచ్చగా ఆ భూములను ఆక్రమించుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్నారని ఆయన విమర్శించారు

సిపిఐ 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలను రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన పట్టణ కేంద్రాలలో విస్తృతంగా సంబరాలను నిర్వహించాలని సిపిఐ చరిత్రను ప్రజలకు తెలిపే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సిపిఐ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి ఆనాటి బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో విప్లవద్యమాలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ కార్యకర్తలు ప్రజలు ఆందోళన పోరాటాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు

రాబోయే కాలంలో జిల్లావ్యాప్తంగా భూ పోరాటాలు నిర్వహించి ఇండ్ల స్థలాలు లేని నిరుపేదలను గుడిసెలు వేయించి భూ పోరాటం నిర్వహిస్తామని ఆయన తెలిపారు

ఈ మహాసభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వతాలు నియోజకవర్గ కన్వీనర్ దత్తు నాయక్ మండల కార్యదర్శి పల్నాటి యాదయ్య కందుకూరు మండల కార్యదర్శి రాజు దేవేందర్ గౌడ్ బ్రహ్మచారి యాదగిరి

పాల్గొన్నారు

మహేశ్వరం నూతన కమిటీ ఎన్నిక

మండల కార్యదర్శిగా దేవేందర్ గౌడ్ సహాయ సహాయ కార్యదర్శి బ్రహ్మచారి వీరితోపాటు 9 మంది కార్యవర్గం 21 మందితో కౌన్సిల్ సభ్యులను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్టు జిల్లా కార్యదర్శి పాలమకుల జంగయ్య ప్రకటించారు. కందుకూరు మండలం కార్యదర్శిగా కొమ్మగల రాజు 9 మంది కౌన్సిల్ సభ్యులు ఏకీభ్రంగా ఎన్నిక కావడం జరిగింది.