*తుర్కయంజాల్ లో ఘనంగా చిత్రక ఫ్యాబ్రిక్స్ బోటిక్యూ ప్రారంభోత్సవం*
*తుర్కయంజాల్ :జూన్ 27 (నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న)*
నాగార్జున సాగర్ జాతీయ రహదారి తుర్కయంజాల్ లోని షోరూం ప్రక్కన శుక్రవారం చిత్రక ఫ్యాబ్రిక్స్ అండ్ బోటి క్యు ను హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి చిత్రక ఫ్యాబ్రిక్స్ అండ్ బోటి క్యు నిర్వాహకులు తేజస్విని, సుకన్య, నరసింహారెడ్డిలతో కలసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ తుర్కయంజాల్ పరిసర ప్రాంతాల మహిళలు యువతులకు నాణ్యతతో కూడిన వస్త్రాలను అందరికీ అందుబాటు ధరల్లో అందించేందుకు నిర్వాహకులు తుర్కయంజాల్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.అనంతరం నిర్వాహకులు తేజస్విని సుకన్య నరసింహారెడ్డి మాట్లాడుతూ నాణ్యతతో కూడిన ఫ్యాబ్రిక్స్ బోటి క్యు వస్త్రాలను సరసమైన ధరలకు అందించడం తమ ప్రత్యేకత అన్నారు.ఈ అవకాశాన్ని తుర్కయంజాల్ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి,టిపిసిసి కార్యదర్శి కొత్త కుర్మా మంగమ్మ శివకుమార్,బిజెపి పార్టీ రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షులు రాజగోపాల్ గౌడ్,నోముల దయానంద్ గౌడ్,కోషిక ఐలయ్య,బిజెపి పార్టీ నాయకులు బచ్చిగళ్ళ. రమేష్,పాండాల శ్రీధర్,బద్దం రవీందర్,గంగని శ్రీను తదితరులు పాల్గొన్నారు.