Neti Satyam
Newspaper Banner
Date of Publish : 28 June 2025, 11:43 am Editor : Admin

కొల్లాపూర్ నియోజక వర్గాన్ని పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దాలి సిపిఐ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

కొల్లాపూర్ నియోజకవర్గాన్ని

పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దాలి …

కొల్లాపూర్ జూన్ 28 (నేటి సత్యం ప్రతినిధి: యస్.పి. మల్లికార్జున సాగర్)

ప్రకృతి సహజ సిద్ధం గా ఎన్నో వనరులు ఉన్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పారిశ్రామిక రంగం గా అభివృద్ధి చేయాలనీ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ ఎస్ఎండి ఫయాజ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశం లో ఫయాజ్ మాట్లాడుతూ నేడు కేంద్రం లో మూడోసారి అధికారం లోకి వచ్చినటువంటి బిజెపి ప్రభుత్వం హోం మినిస్టర్ అమిత్ షా ఈ దేశం లో కమ్యూనిజాన్ని రూపుమాప చేయాలనే ఆలోచనతో ఆపరేషన్ కాగర్ అనేటువంటి ఒక దుర్మార్గ ఆపరేషన్ చేపట్టిందన్నారు.

నిజానికి టెర్రరిజాన్ని అంతం చేయాలని శాంతిని నెలకొల్పాలని ఈ ఆపరేషన్ చేసి ఉంటే కమ్యూనిస్టులు దీన్ని అంత గా వ్యతిరేకించే వాళ్ళు కాదు కానీ ఈరోజు అమిత్ షా వారి మిత్రుడు అయినటువంటి ఆదాని కి లాభాన్ని చేకూర్చడానికి అడవి సంపదను మొత్తం కార్పొరేట్ శక్తులకు విదేశీ శక్తులకు దోచిపెట్టడానికి ఆపరేషన్ కంగార్ ను సృష్టించి అమాయకులైనటువంటి అక్కడున్న గిరిజనుల ప్రాణాలను తీయడం జరుగుతోంది అని, అమాయకులైన ఆదివాసీలను గిరిజనులను హతమార్చినటువంటి ఈ దారుణమైనటువంటి చర్యను సిపిఐ గా తీవ్రం గా ఖండిస్తున్నాం అని ఫయాజ్ అన్నారు.

మంత్రి అమిత్ షా వచ్చే మార్చ్ 22 నాటికి నక్సలైట్లను అంతం చేయడం అనేటటువంటి భాష చాలా విచిత్రకరమైనటువంటిది అని ,దేశం లో ఏ అసాంఘిక శక్తులైన సరే మాతో చర్చించండి అని ముందు ప్రభుత్వం ఆహ్వానించాలి అని ఫయాజ్ అన్నారు.

ఒక ప్రజాస్వామ్య శాంతి స్వభావం కలిగినటువంటి దేశం ఆ దేశానికి ఒక హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అమిత్ షా వాళ్ళతో చర్చించాల్సింది పోయి, వాళ్ళు చర్చలకు మేము సిద్ధమని ఆ మావోయిస్టు పార్టీ వాళ్ళు చెప్తున్నా ఒక్కొక్కరిని పట్టుకెళ్ళి అగ్ర నాయకులను అందరిని కూడా ఎన్కౌంటర్ చేసి వారి శవాలను కూడా వారి కుటుంబాలకు ఈయకుండా చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్య హోo మంత్రి చెయ్యడం కరెక్ట్ అనేది కాదు అని ఫయాజ్ అన్నారు.

నక్సలైట్ లో కూడా ఎవరైతే ఈ మావోయిస్టు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు మావోయిస్టు పార్టీలకు వాళ్లకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రస్తుతం మారిన పరిస్థితులు ఉంది కాబట్టి మీరు కూడా ప్రజల్లో ఉండాలి అందరూ కలిసి ఈ దేశం లో ఉన్నటువంటి ఎర్రజెండా మొత్తం కలిసి ఈ దేశం లో ఉన్న పీడితుల్ని పీడించే బూర్జవశక్తుల పైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఈ దేశం లో విప్లవం రావడం ఎంతో దూరం వుండదు కాబట్టి మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం కూడా అలా ఆలోచించాలని సిపిఐ నాయకులు ఫయాజ్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ ఆపరేషన్ ఆపి మావోయిస్టు పార్టీతో చర్చలు జరిపించాలని ఈ బూటకపు ఎన్కౌంటర్లకు స్వస్తి పలకాలని సిపిఐ గా ఆల్ ఇండియా సమితి రాష్ట్ర సమితి జిల్లా నియోజకవర్గ సమితి కూడా డిమాండ్ చేస్తున్నాయి అని ఆయన అన్నారు.

, రెండో విషయం ఈరోజు రాష్ట్రం లో ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి రావడం జరిగింది కమ్యూనిస్టు పార్టీ సిపిఐ భాగ్య స్వాములుగా వాళ్లతో కలిసి ఓట్ షేడింగ్ ద్వారా మేమంతా కూడా ఈ ప్రభుత్వం లో భాగ్యస్థానం లో కూడా ఉండడం జరిగింది.

కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసేటువంటి ప్రక్రియలో 100% అమలు చేయడం లో వాళ్ళు ఎందుకో చిత్తశుద్ధి చూయించినట్లు కనపడడం లేదు అని ఫయాజ్ అన్నారు.

గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరి పేరు రాలేదు. అనేది గ్రామాలలో గ్రామపంచాయతీ నోటీసు బోర్డుపై చూపించాలి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రజలందరూ ఈ విషయంపై చాలా ఆయోమయం స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది తర్వాత ఈ రైతు భరోసా గాని లేకపోతే రుణమాఫీ గానీ ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికి కూడా రైతులకు అందడం లేదు ఇప్పుడు చూస్తే వర్షాకాలం ప్రారంభమవుతుంది రైతులంతా కూడా ఈ కార్తిలో మొత్తం వ్యవసాయల క్షేత్రాల్లోకి వెళ్లిపోయి ఆ విత్తనాలు వేసి అంత పంట పొలాల్లో వాళ్ళు పనుల్లో నిమగ్నమైన పరిస్థితి కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ రైతులకు కావలసినటువంటి సౌకర్యాలు అందినప్పటికీ పూర్తిస్థాయిలో అందడం లేదనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలు గ్రహించాలని విత్తనాల పంపిణి చేయాలి నకిలీ విత్తనాలు గుర్తించి రైతులను ఆదుకోవాలి రైతులకు సరిపోయే విత్తనాలు కూడా ఎక్కడ ఉండేటువంటి పరిస్థితి కనబడడం లేదు అని ,మహిళలకు 2500 రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని కోటి ఆశలతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ప్రజలందరూ కూడా నమ్మిశాతం మహిళలు ఓట్లు వేశారు కానీ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అయినప్పటికీ సంవత్సరంనర దాటుతున్నప్పటికీ ఇంకా గత ప్రభుత్వం పైన చెప్పి కాలయాపన చేయడం అనేది కరెక్ట్ కాదు తక్షణమే ఈ మహిళలకు 2500 నగదు ఏదైతే ఇస్తామన్నారో అదంతా కూడా ఇవ్వాలని ఫయాజ్ డిమాండ్ చేశారు.

సిలిండర్ కరెంటు 100% అమలు చేయాలనీ, వారు ఇస్తామన్నట్టు అమలు చేస్తామన్నటువంటి ఆరు గ్యారెంటీలు అమలుకు ఆ రేవంత్ రెడ్డి సర్కారు కచ్చితం గా కృషి చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉందని హయాజ్ అన్నారు.

అలాగే ఆ 420 హామీలను కూడా ఒక్కొక్కటిగా అమలు చేయాలని వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, తక్షణమే ఎన్నికలు నిర్వహించే ప్రక్రియ కూడా ప్రారంభించాలని గ్రామాల్లో ఇప్పటికే స్పెషల్ సెక్రటరీ లేక పరిపాలన స్పందించిపోయింది కాబట్టి ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాల పైన ప్రభుత్వం ఒక స్పష్టత తీసుకువచ్చి వీలైనంత త్వరగా ఎన్నికల ప్రారంభించాలని ఫయాజ్ డిమాండ్ చేశారు.

నిన్ననే హైకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చినట్టు ఉంది స్థానిక సంస్థల ఎన్నికలలో తక్షణమే నిర్వహించాల్సింది బాధ్యత ఉంది, చాలా టైం అయింది కాబట్టి ఆ వైపుగా నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాము అని ఫయాజ్ అన్నారు.

మొలచింతపల్లి గ్రామం లో జిల్దారి తిప్ప నుంచి రావాల్సినటువంటి సాగునీరు దాదాపుగా ఒక దశాబ్దన్న కాలం నుంచి అంతకు ముందు నుంచి రంగదాసు గారి కాలం నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత రైతులు సాగు చేసే రైతులంతా కూడా చాలా పెద్ద ఎత్తున దానిపై ఆశలు పెట్టుకోవడం జరిగింది ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు వ్యవస్థ మారింది కానీ అక్కడున్నటువంటి ఆ సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు అని,

ప్రతిసారి వచ్చిన ప్రతి ఒక్కరూ దానిపైన ఏదో ఒక మాట చెప్పి కాలయాపన చేసి వాళ్ళ పదవి కాలం ముగించుకొని పోతున్నారు కానీ మొల చింతపల్లి పరిసరాల్లో ఉన్నటువంటి రైతులు ఉన్నటువంటి మొత్తం ఆయకట్టు రైతులందరి తీవ్ర నష్టమే జరుగుతున్నది అని , రాష్ట్ర ప్రభుత్వం ఒక యుద్ధ ప్రాతిపదిక చర్యలు తీసుకోని జిల్దార్ చెరువుకు కృష్ణానది నీటిని తరలించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నదని పయాజ్ అన్నారు.

..కొల్లాపూర్ ప్రాంతం లో ఉన్నటువంటి నల్లమల్ల అడవిలో లభిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి ఎదురు బొంగు సున్నపురాయి సిమెంట్ రాయి గ్రైనేడు అనేక ముడి సరుకులు మనకు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి ఆ ముడి సర్కుల ద్వారా ఈ ప్రాంతంలో పరిశ్రమల నిర్మించి ఆ పరిశ్రమల ద్వారా ఇక్కడ చదువుకున్న యువకులకు ఉపాధి కల్పించి ఉద్యోగాలు కల్పిస్తూ ఉద్యోగ ఉపాధిలకై హైదరాబాదు ఇతర నగరాల కెళ్ళి కూలినాళీ చేసుకునే బతుకు జీవులకు కొల్లాపూర్ లోనే ఉపాధి కల్పించాలని సిపిఐ నాయకులు ఫయాజ్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమాలన్నీ అమలు కావడానికి ప్రయత్నం చేస్తాం లో ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కుల లో భాగం గా కచ్చితంగా ఈ ప్రభుత్వం పైన నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి సిపిఐ సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఫయాజ్ వ్యక్తం చేశారు.

ఈ సమావేశ కార్యక్రమం లో మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి ఇంద్రమ్మ ,కొల్లాపూర్ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, కోడేరు మండల కార్యదర్శి కిరణ్ కుమార్, హైదరాబాద్ జిల్లా నాయకులు మామిడి చెట్ల వెంకటస్వామి, మండల నాయకులు యూసుఫ్, జంగం శివుడు, రమేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.