(adsbygoogle = window.adsbygoogle || []).push({});
మంత్రి అనుకుంటే 24 గంటల్లో పరిష్కారం చేయవచ్చు
జర్నలిస్టుల ఇళ్ల సమస్య పెద్ద పని కాదు రాత్రికి రాత్రికి కార్పొరేటర్ సంస్థలకు వందల వేల ఎకరాలను 50 రూపాయలకు కట్టిపెడుతున్న వానికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పెద్ద పని కాదన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు 1999లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నుంచి విలేకరులకు సంబంధించినటువంటి ఇండ్ల స్థలాల డిమాండ్ కొనసాగుతూనే ఉంది
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ఎండి ఫయాజ్
కొల్లాపూర్ పట్టణంలో ఆర్డిఓ కార్యాలయం ఎదుట జరుగుతున్న జర్నలిస్టుల దీక్షలకు శనివారం
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ఎండి ఫయాజ్ నాయకత్వంలో సిపిఐ బృందం మద్దతు ప్రకటించింది. కొల్లాపూర్ నియోజకవర్గం పట్టణ జర్నలిస్టుల కు ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం దీక్షలు నాలుగో రోజు కొనసాగాయి ఈ దీక్షలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రం నియోజవర్గ కన్వీనర్ జలకం మద్దిలేటి, జిల్లా నాయకులు మల్లికార్జున సాగర్ సీనియర్ జర్నలిస్టులు బచ్చలకూర కురుమయ్య, సిపి నాయుడు, రమణ, కారంగి గోవిందు, భాను, స్వాములు, సురేందర్, రాము, పరశురాముడులు కూర్చున్నారు. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎస్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ ఇప్పుడు అంతా ప్రజాస్వామ్య వ్యవస్థ సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంతా మీడియా యుగంలో మనం అంత ప్రస్తుతం ఉన్నాం కానీ రోజులు చీకటి రోజులు ఒక మనిషికి మరో మనిషిలో జరిగే ప్రతి పరిణామాన్ని అక్షర అక్షరం అంతా కూడా సేకరించి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల వద్దకు చేరే తీయడానికి ఆనాటి ప్రథమ స్వాతంత్ర ఉద్యమం నుండి మొదలుకొని మొదటి ప్రపంచ యుద్ధ నుంచి మొదలుకొని ఫ్రెంచ్ ఉద్యమం వరకు తెలంగాణ విముక్తి ఉద్యమం ఏదైతే జరిగిందో ఆ పోరాటం మనకు భూమి ఉద్యమాలు జరిగినా ఎన్ని పోరాటాలు జరిగిన ఏ కుల పోరాటం జరిగినా ఏ పార్టీలపై అవినీతి వ్యతిరేక పోరాటం జరిగిన కనిపించి కనిపించినటువంటి ఒక అదృష్ట శక్తి ఉంటుందన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి పాత్రను వహిస్తూ ఈ దేశంలోనే కాదు ఈ సమాజంలో ఎక్కడైనా సరే ప్రజలు ఏ పోరాటం చేసిన ప్రభుత్వాలు ఏ పథకాలు తీసుకొచ్చిన ఏ నిర్ణయాలు నిర్వహించిన ఆ నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్ళడానికి వెళ్లిన నిర్ణయాల పట్ల ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి లేదా ప్రభుత్వం వివరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన గ్రామీణ గ్రౌండ్ పట్టణ మహా నగరాల్లో ఉన్నటువంటి ప్రజలు ఏ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఆ నిరసన కూడా తిరిగి ప్రభుత్వానికి తీసుకెళ్లడానికి ఇటు ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య ఒక వారధి ఈ పాత్రికేయ రంగం అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు జర్నలిస్టుల సమస్యల గురించి ఆలోచించాలి విమర్శలు చేయాలని నా ఉద్దేశం కాదు గాని ఈ సమస్యను మీరు అనుకుంటే 24 గంటల్లో పరిష్కారం చేసి ఇక్కడున్న అర్హులైన ప్రతి విలేఖరికి మీరు ఇండ్ల స్థలాల ఇవ్వవచ్చున్నారు. ఉంది మరి వారెందుకు దీన్ని ఆ నెగ్లెన్స్ చేస్తున్నారో వారికి ఉన్న మేధస్సు వారికి కొల్లాపూర్ నియోజక వర్గం పట్ల ఉన్నట్టుండి అపూర్వ అనుభవం ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఆయన 1999లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నుంచి ఈ విలేకరులకు సంబంధించినటువంటి ఇండ్ల స్థలాల డిమాండ్ చాలా ఉందన్నారు. మాజీ శాసనసభ్యులు హర్షవర్ధన్ రెడ్డి ప్రోసిడింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అక్కడ కూడా క్షమించరాని నిర్లక్ష్యం జరిగిందన్నారు. నేను ఒకటే అడుగుతున్నాను మీరు ఏం మాట్లాడినా మీరు ఎక్కడ ఏ కార్యక్రమం చేసిన ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు కాబట్టి దీంట్లో జిద్దులోకి తీసుకొచ్చి ఆ ఇగో విధానంతో పోవద్దని ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అని తెలిపారు. మంత్రిగారే కాదు మంత్రిగారి కన్నా ఎక్కువగా పదవులు పొందాలనుకున్నట్టు వాళ్ళు పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అందరూ కూడా మీ నాయకత్వం పైన ఒత్తిడి చేయలన్నారు. ప్రజాస్వామ్యానికి పెద్ద పీఠమైనటువంటి జర్నలిజం సభ్యులు ఇలా అన్యాయం చేయవద్దన్నారు.
రాజకీయ పార్టీల దగ్గరికి వాళ్లు వాళ్ళని రమ్మని అడిగి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం అయినప్పటికీ వాళ్ళు జర్నలిస్టులు అయినప్పటికీ వాళ్ళు చేతులు ఉన్న కళాలు ఈ వ్యవస్థలను కూల దోయగలనటువంటి సత్తా ఉన్నప్పటికీ వాళ్ళు కూడా పౌరులు కాబట్టి వాళ్లు వాళ్ళకున్నటువంటి ఇచ్చిందో అడిగే స్వేచ్ఛ మాట్లాడే స్వేచ్ఛ ప్రశ్నించే స్వేచ్ఛ అనేది ఉందో దాటి ఆరంగానే ఈరోజు వారు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు మీ పోరాటం జయప్రదం కావాలని ఈ టెంట్ ఇలా నాలుగు రోజులు కొనసాగుతోంది నేను మొదట్లో అనుకోలేదు పెద్దరికం మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఆయన ఖాతాలోనే చేరుతుంది కాబట్టి పెద్దమనస్సు చేసుకొని ఒక గంట సమయం తీసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కొల్లాపూర్ మంత్రి సొంత ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఆ విలేకరులు ఆందోళన చేస్తే ఆయన ప్రతిష్టకు అంతా కరెక్ట్ గా ఉండదు కాబట్టి వారు పెద్దమనస్సుతో అర్థం చేసుకోవాలన్నారు. మీరు ఒక సంఘం ఇంకో సంఘం విడిపోకుండా సంఘాలు ఏవైనాప్పటికీ కొల్లాపూర్ లో ఉన్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరూ సంఘాలకు అతీతంగా ఐక్య ఉద్యమాలు చేస్తే మరింత ఎఫెక్ట్ గా ఉంటుందన్నారు. అన్ని సంఘాలు కూడా కలిసి రావాలి అన్ని సంఘాల వాళ్ళు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలన్నారు. అందరు కూడా ఏకమై ఒక సమిష్టి ఉద్యమం చేయగలిగితే మరింత ఎఫెక్టివ్ గా ఉంటుందన్నారు. జర్నలిస్టుల ఇళ్ల సమస్య పెద్ద పని కాదు రాత్రికి రాత్రికి కార్పొరేటర్ సంస్థలకు వందల వేల ఎకరాలను 50 రూపాయలకు కట్టిపెడుతున్న వానికి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం పెద్ద పని కాదన్నారు. వెంటనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి సిపిఐ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సిపిఐ నాయకులు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి తుమ్మల శివుడు 
కోడేరు మండల కార్యదర్శి కిరణ్
మహిళ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఇందిరమ్మ
సీనియర్ నాయకులు మామిడిచెట్ల వెంకటస్వామి
పట్టణ కార్యదర్శి యూసఫ్