Neti Satyam
Newspaper Banner
Date of Publish : 29 June 2025, 5:56 pm Editor : Admin

నాలుగు లేబర్ కోర్లను రద్దు చేయాలి రామస్వామి. సత్యనారాయణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి*

*జూలై 9వ తేదీన జరిగే దేశవ్యాపిత సమ్మెను విజయవంతం చేయండి*

*ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె రామస్వామి*

*ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ*

నేటి సత్యం. చేవెళ్లే. జూన్ 28

కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కార్మికులకు నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని జులై 9 వ తేదీన దేశవ్యాపిత సమ్మెను విజయవంతం చేయాలని ఈరోజు చేవెళ్లలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కె రామస్వామి హాజరై మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికుల పైన రైతుల పైన దాడి మొదలు పెట్టాడని కార్మికులు పోరాడి సాధించుకున్న 44 రకాల చట్టాలను పెట్టుబడిదారీ వర్గానికి కొమ్ముకాస్తూ నాలుగు కోడ్ లుగా మార్చి కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయానికి గురి చేస్తున్నాడని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పజెప్పడం జరుగుతుందని కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పది దినాలు పోయి 12 గంటల పని దినాలు రావడం జరుగుతుందని మోడీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దానికి అనుగుణంగా కార్మికుల యొక్క జీతభత్యాలు పెరగడం లేదని పెద్ద నోట్ల రద్దు జిఎస్టి తీసుకురావడం వల్ల అనేక రకాల చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూతపడి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని వారి జీవనం అస్తవ్యస్తంగా మారిపోయిందని దానికి కారణం కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వమే అందుకే జూలై 9 వ తేదీన దేశవ్యాపిత సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు అన్ని ఒకే తాటిపైకి వచ్చాయని ఈ సమ్మెలో కార్మికులు కర్షకులు ప్రజలు రైతులు పార్టీ శ్రేణులు శ్రేయోభిలాషులు వేలాది అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి ఇన్సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బూల్ ఏఐటీయూసీ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు వడ్ల మంజుల బిఓసి జిల్లా కార్యవర్గ సభ్యుడు జయ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు