Neti Satyam
Newspaper Banner
Date of Publish : 30 June 2025, 9:59 am Editor : Admin

శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ లో భారీ చేరిక




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ లోకి భారీ చేరికలు*

నేటి సత్యం. శేర్లింగంపల్లి. జూన్ 30

శేరిలింగంపల్లి:కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని, అహర్నిశలు కష్టపడి పనిచేసిన నాయకులకు తగిన న్యాయం జరగకపోవడంతో, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఖాళి అవుతున్న విషయం విదితమే, ఈ నేపథ్యంలో తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీతోనే భవిష్యత్ ఉందని, కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ఉన్నత స్థాయిలో నిలుస్తుందని బలంగా నమ్ముతూ, ఈరోజు సీనియర్ నాయకులు సాయి నందన్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో, గ్రేటర్ హైదరాబాద్ బిఆర్ఎస్ యూత్ మాజీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మారబోయిన రవి యాదవ్ గారి సమక్షంలో, పాపి రెడ్డి కాలనీ నుండి దాదాపు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మారబోయిన రవి యాదవ్ గారు వారందరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా స్వగతం తెలిపారు.

రవి యాదవ్ మాట్లాడుతూ

“గత పదేళ్లు కెసిఆర్ చేసిన అభివృద్ధిని చూసి కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకుడు ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని వారంతా బిఆర్ఎస్ లో చేరారు.

దళిత బంధు, కళ్యాణ్ లక్ష్మి, రుణమాఫీ, 420 పార్టీ కాంగ్రెస్ పార్టీ మాటలు చెప్పడం తో తప్ప పని చేయడానికి రాదు.

నిన్న గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ లో నూతనంగా ప్రారంభించిన పిజెఆర్ ఫ్లైఓవర్ మన బిఆర్ఎస్ పార్టీ అయామ్ లోనే 80% పనులు పూర్తి చేసుకున్నాము”.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కే ఎన్ రాములు, డాక్టర్ రవి కుమార్, ప్రభాకర్ గౌడ్, స్వామినాథ్, గడ్డం శ్రీనివాస్ , కొండకల్ శ్రీనివాస్, వెంకటరెడ్డి, గంగాధర్ గౌడ్, శ్రీకాంత్ యాదవ్, శంకర్, అనిత, పవన్ తదితరులు పాల్గొన్నారు.