నేటి సత్యం
*శ్రీరామ్ హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో,భీమ ఫౌండేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం*
*మన్సూరాబాద్: జూన్ 30నేటి సత్యం ప్రతినిధి మిమిక్రీ యాకన్న*
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ హిల్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో, *భీమ ఫౌండేషన్ – తెలంగాణ* వారు, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో డివిజన్ మాజీ అధ్యక్షులు పోచబోయిన జగదీశ్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి పాల్గొని రక్తదానం చేశారు.
చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన భీమా ఫౌండేషన్ వారిని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి రక్తదానం చేసిన దాతలకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ రామ్ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం వారు, డివిజన్ నాయకులు, యువత, కాలనీ వాసులు పాల్గొన్నారు.