Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 July 2025, 11:42 am Editor : Admin

అమెరికా చేతిలో తొత్తుగా మారిన నరేంద్ర మోడీ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*అమెరికా చేతిలో తొత్తుగా మారిన నరేంద్రమోదీ*

నేటి సత్యం. హైదరాబాద్. జూలై 2

*140 కోట్ల ప్రజల ప్రయోజనాలను ట్రంప్ కు తాకట్టు పెట్టిన మోడీ విధానాలపై పోరాడుదాం

*ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో అమెరికా కాన్సులేట్ ముట్టడి, భగ్నం, నేతల అక్రమ అరెస్ట్ చేసిన పోలీసులు*

*వలి ఉల్లా ఖాద్రీ/ కల్లూరు ధర్మేంద్ర, ఏఐవైఎఫ్*

రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి

140 కోట్ల ప్రజల ప్రయోజనాలను ట్రంప్ కు తాకట్టు పెట్టిన మోడీ విధానాలు నశించాలని, అమెరికా చేతిలో తొత్తుగా మారిన నరేంద్రమోదీ అని, భారతీయులపై అమెరికా దుర్మార్గ చర్యలు ఆపాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఛలో అమెరికా రాయబార కార్యాలయ(అమెరికన్ కాన్సులేట్) ముట్టడి కార్యక్రమాన్ని హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి ర్యాలీగా వెళ్లిన నేతలను,ర్యాలీని అడ్డుకుని తోపులాటలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మోడీ, ట్రంప్ వేషధారణలతో , నల్ల చొక్కాలను ధరించి నిరసన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర* లు మాట్లాడుతూ దివాళా కోరు ఉగ్రవాద ప్రేరేపిత దేశం పాకిస్తాన్ కు అమెరికా రెడ్ కార్పెట్ వేస్తూ తన సామ్రాజ్యవాద విష పోకడలను అనుసరిస్తుందని ధ్వజమెత్తారు. ఔర్ ఏక్ బార్ ట్రంప్ సర్కార్ అంటూ అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో మోడీ ట్రంప్ గెలుపు కోసం భారతీయులతో మీటింగ్ ఏర్పాటు చేసి ట్రంప్ ను గెలిపించాలని మోడీ కోరడం సిగ్గు చేటు అన్నారు. అనంతరం ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ భారతీయులపై తన కర్కషాన్ని ప్రదర్శించాడన్నారు.ఇటీవల కాలంలో జరిగిన భారత్, పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ నిసిగ్గుగా మీడియాకు చెప్పినా, మోడీ ఖండించలేదన్నారు. వాస్తవానికి అమెరికాలోని వైట్ హౌస్ లో ట్రంప్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసీమ్ మునీర్ ను ఆహ్వానించిన సందర్భంలోనే , మన దేశ ప్రధానమంత్రి మోడీ ను ఆహ్వానించడం, మన ప్రధాని హాజరవ్వడం చూస్తే ట్రంప్ 140కోట్ల ప్రజలను అవమానించడమేనని వారు ధ్వజమెత్తారు. ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ పలుమార్లు అన్నాడని, వ్యాపార దృక్పథంతో మాత్రమే ట్రంప్ ఆలోచిస్తునాడే తప్ప, భారత్ తో స్నేహ సంబంధం పచ్చి మోసం,దగా అని అన్నారు. ఇటీవల పాకిస్తాన్కు ప్రపంచ బ్యాంకు నుండి 15వేల కోట్లు రుణాలు ఇప్పించింది ట్రంప్ కాదా? ట్రంప్ భారత్ కు చేస్తున్న దుర్మార్గాలను నరేంద్ర మోదీ ఖండించకుండా, 140కోట్ల ప్రజల సార్వభౌమత్వాన్ని, సమగ్రతను తాకట్టు పెట్టొచ్చా? ఇప్పటికైనా సామ్రాజ్యవాద అమెరికా నీచ పోకడలను మోడీ వ్యతిరేకించాలని వారు డిమాండ్ చేశారు.

మొన్నటి వరకు భారత్ కు తిరిగొచ్చిన వారందరూ మెరుగైన ఉపాధికోసం అమెరికా బాటపట్టినవాళ్లేనని, ఆస్తులు తాకట్టుపెట్టి, అందిన చోటల్లా అప్పులు చేసి ఏజెంట్లకు డబ్బులు ధారపోసి మరీ అక్కడికి వెళ్లారన్నారు. అలాంటి వారిని తిప్పి పంపడంలో కర్కశత్వం ప్రదర్శించడమూ సమంజసం కాదని, యుద్ధఖైదీల పట్ల కూడా అమానుషంగా వ్యవహరించరాదన్నది నాగరిక ప్రపంచ కట్టుబాటు. ఈ కట్టుబాట్ల సంగతి అటుంచితే కనీస మానవత్వం కూడా చూపించని ట్రంప్ సర్కారు పోకడలు గర్భనీయమైనవన్నారు. కరడుగట్టిన నేరస్తుల్లా చేతులు, కాళ్లకు సంకెళ్లు, సరుకుల రవాణా చేసే సైనిక విమానాల్లో కుక్కేసిన మూటల్లా సుమారు ముప్పై గంటలకు పైగా ప్రయాణం.. ఇది మన దేశ వలసదారుల తరలింపుపై అమెరికా అమానుష వైఖరి అని ధ్వజమెత్తారు. ఒక వైపు భారత్ తో తమకు స్నేహ సంబంధాలున్నాయని చెబుతూనే మనవారిని అవమానకరంగా, అమానవీయంగా మన దేశానికి పంపిన సంఘటన దారుణమన్నారు. ‘మేరా భారత్ మహాన్’ అని ఉపన్యాసాలు సందించే మోడీ గొంతు మాత్రం కనీసంగా కూడా పెగల్లేదని ఎద్దేవా చేశారు.

మోడీ, బీజేపీ వల్ల ‘వికసిత భారత్’లో నిరుద్యోగం భయంకర స్థాయికి చేరుకుంది. ప్రధాని అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో యువతకు మోడీ ఇచ్చిన ప్రధాన హామీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, ఇప్పటి వరకు ఒక్క కొత్త ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. ఇచ్చి ఉంటే నిరుద్యోగిత ఎందుకు కట్టలు తెంచుకుంటుంది? స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలు గాలిలో కలిశాయన్నారు. చివరికి ఎక్కడిదాకా వచ్చిందంటే, విధిలేక వీధుల వెంట పకోడీలు అమ్ముకునే పని కూడా ఉపాధి, ఉద్యోగం కిందికే వస్తుందనే స్థాయికి ప్రధాని,హోంమంత్రి భాష్యాలు చెప్తున్నారని. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువత ఉపాధి లేక నిరాశ నిస్పృహలతో బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలనేకం ఉన్నాయన్నారు. బీజేపీ ప్రచారం చేసుకునే ‘అచ్చేదిన్’ వచ్చి ఉంటే ఇంత మంది యువత విదేశాలకు సక్రమంగానో, దొడ్డి దారినో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా అని వారు కేంద్ర ప్రభుత్వంను ప్రశ్నించారు.

ఈ విడుదల కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ బిజ్జ శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సల్మాన్ బేగ్, ఎండీ. కుతుబ్, రాష్ట్ర సమితి సభ్యులు మాజీద్ అలీ ఖాన్,శేఖర్, కళ్యాణ్, నాగరాజు, మోసిన్ ఖాన్, మధుకర్, మధు, సునీల్ పాల్గొన్నారు.