Neti Satyam
Newspaper Banner
Date of Publish : 02 July 2025, 11:54 am Editor : Admin

పటాన్ చెరువు సిగాజి కెమికల్స్ బాధితులను పరామర్శించిన నాయకులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

సిగాజి కెమికల్స్. బాధ్యులను పరామర్శించిన. నాయకులు

నేటి సత్యం. శేరిలింగంపల్లి. జులై 2

*పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో ‘సిగాచి కెమికల్స్’ లో భారీ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను మదీనాగూడ ప్రణామ్ హాస్పిటల్ లో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజా నరసింహ గారు, టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేఖపూడి గాంధీ గారు, ఎంబీసీ ఛైర్మెన్ జెరిపేటి జైపాల్ గారు, తదితర డివిజన్ల కార్పొరేటర్లతో కలిసి పరామర్శించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షతగాత్రులను పరామర్శించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించమని డాక్టర్లకు సూచించామన్నారు. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుదన్నారు.*