Neti Satyam
Newspaper Banner
Date of Publish : 03 July 2025, 1:36 pm Editor : Admin

బి కే ఎన్ యు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

జూలై 5 6 తేదీలలో జరుగు

బి కే ఎన్ యు జిల్లా మహాసభలను జయప్రదం చేయండి

నేటి సత్యం షాద్నగర్ న్యూస్ 3

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా 9వ మహాసభలు షాద్నగర్ పట్టణం పెన్షనర్స్ భవనంలో నిర్వహించ తల పెట్టాము అధిక సంఖ్యలో వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ కార్మికులకు పనులు దొరకడం లేదని వ్యవసాయ సీజన్లో వలస కార్మికులు వచ్చి పనులు చేస్తున్నారని ఇక్కడున్న కార్మికులకు పనులు దొరుకుపోవంతో ఇక్కడున్నవారు సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కనీసం గ్రామాలలో ఎన్ ఆర్ ఇజి ఎస్ లో నన్న పని చేసుకుని ఇంటి పట్టున ఉంటారని ఎంతో ప్రతిష్టాత్మకంగా 2005లో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజురోజుకు నిర్వీర్యపరుస్తూ పేదలకు పనులు దొరకకుండా చేస్తుందని ఆయన మండిపడ్డారు పథకానికి సరైన నిధులు కేటాయించక సరైన వసతులు కల్పించక సరిపడు ఉద్యోగులను కేటాయించక పథకాన్ని నిరువీర్య పరుస్తూ ఎత్తేసె ఆలోచనలు కేంద్ర

నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది ఆయన ఆరోపించారు అదే జరిగితే గ్రామీణ ప్రాంత కూలీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని దాన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత నత్త నడకన పథకాలను అమలుపరుస్తుందని ఆయన విమర్శించారు ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఊర్లో పునాదులు తీస్తున్నారని ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల అని చెప్పి ఐదు లక్షల వరకే ప్రొసీడింగ్లు ఇచ్చారని ఇది ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు అమలుకు సాధ్యంగాని హామీలు ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు పరచడంలో చిత్తశుద్ధి లేకుండా పోయిందని ఆయన మండిపడ్డారు ప్రజలకు అనేక రకమైన సమస్యలు ఉన్నాయని సమస్యలన్నిటిని కూడా ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించి భవిష్యత్తు పోరాటాలకు రూపకల్పన చేయబోతున్నామని ఈ మా సభలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మిగతా రాష్ట్ర జిల్లా నాయకులు జిల్లా వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతున్నారు పెద్ద ఎత్తున వ్యవసాయ కార్మికులు పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు