(adsbygoogle = window.adsbygoogle || []).push({});
* ఎరుపెక్కిన శేర్లింగంపల్లి
* ఎలక్షన్ ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలి జాతీయ నాయకులు పల్లా వెంకట్ రెడ్డి
నేటి సత్యం. శేర్లింగంపల్లి. జులై 6
శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సిపిఐ 4వ మహాసభ. ఇజ్జత్ నగర్ లో జరిగిన సందర్భంగా సిపిఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని
పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాలని ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వని పక్షంలో పేదలకు కనీసం 50 గజాల ఇంటి జాగానైనా ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 500 కి సిలిండర్ మహిళలకు 2500 లాంటి సంక్షేమ పథకాలు పేద ప్రజల ఉండడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సిపిఐ పార్టీ నూతన మండల కార్యదర్శులను సహయ కార్యదర్శిలను రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ప్రకటించారు నూతనంగా శేర్లింగంపల్లి సిపిఐ మండల కార్యదర్శి టి రామకృష్ణను ఏకగ్రీవంగా ఎన్ని
కయ్యారు సహాయ కార్యదర్శిగా కె చందు యాదవ్ 15 మంది కార్యవర్గ సభ్యులతో 31 మంది కౌన్సిల్ సభ్యులతో సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య తెలియజేశారు నూతనంగా ఎన్నికైన కార్యదర్శి టి రామకృష్ణ సహాయ కార్యదర్శి కే చందు యాదవ్ రాబోయే కాలంలో పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజలకు అందవలసిన సంక్షేమ పథకాలను అందే విధంగా పోరాటాలు నిర్వహించాలని వారికి దిశ నిర్దేశం చేశారు