Neti Satyam
Newspaper Banner
Date of Publish : 08 July 2025, 2:22 am Editor : Admin

శేర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఆహార్నిశలు కృషి చేస్తా సిపిఐ రామకృష్ణ




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

శేర్లింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా…

ఎర్ర జెండా సాక్షిగా పేదలకు అండగా ఉంటా… నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ ఉద్బోధ..

రంగారెడ్డి జూలై 7 నేటి సత్యం న్యూస్ ప్రతినిధి కేబీ రాజు)

సిపిఐ నాలుగోవ మహాసభలో శేరిలింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి సిపిఐ పార్టీ రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శి కే చందు యాదవ్. జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య. రాష్ట్ర సమితి సభ్యులు పానుగంట పర్వతాలు. శేరిలింగంపల్లి నియోజకవర్గం కౌన్సిల్. మాకు ఇచ్చిన అవకాశాన్ని. పార్టీ నిబంధనాల ప్రకారం నడుచుకుంటామని అన్నారు, ఎర్రజెండా అండగా ఉంటే ప్రజల సమస్యలను ఆదుకుంటామని, ఎలాంటి సమస్యనైనా ఉద్యమాల ద్వారానే పోరాటాలు చేసి అధికారులను దృష్టికి తీసుకువస్తామన్నారు, గత కొన్ని సంవత్సరాలుగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో పేద ప్రజలు గూడు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్న వారి సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యమాలకు సిద్ధమయ్యామని పేర్కొన్నారు, సమస్యల ఒడిలో తల్లడిల్లుతున్న ప్రజలను ఒడ్డుకు చేర్చడమే నా వంతు బాధ్యతగా చూసుకుంటామని అన్నారు, రాష్ట్ర అధిష్టానం మేరకు రాబోయే కార్పొరేటర్ ఎన్నికలలో సిపిఐ పార్టీ నుండి శేర్లింగంపల్లి డివిజన్లలో కార్పొరేటర్ పదవికి పోటీ చేయడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు,
నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికై. శేర్లింగంపల్లి నియోజకవర్గం లో స్థానిక సమస్యల పరిష్కారానికి. కృషి చేస్తామన్నారు. శేర్లింగంపల్లిలో ఉన్న సమస్యలను జిహెచ్ఎంసి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎమ్మార్వో, ఇతర అధికారుల దృష్టికి తీసుకురావడం జరుగుతుందన్నారు,