(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*”వైఎస్” ను భగవంతునితో సమానంగా ఆరాధిస్తారు*
*గొప్ప ప్రజా నాయకుడు వైయస్సార్*
*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*
*షాద్ నగర్ లో ఘనంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి*
*చౌరస్తాలో వైయస్ విగ్రహానికి పూలమాలలు, నివాళి*
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డిని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు
భగవంతునితో సమానంగా ఆరాధిస్తారని, మాటతప్పని మడమతిప్పని గొప్ప ప్రజానాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున హాజరైన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ.. గొప్ప రాజకీయ దురంధరుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రమాణస్వీకారం చేయగానే ఎల్బీ స్టేడియంలో ప్రజా సమక్షంలో ఉచిత కరెంటు దస్త్రంపై తొలి సంతకం చేసిన మహా నాయకుడని కొనియాడారు. పల్లెలకు వైద్యాన్ని చేరువచేసి ప్రజల ప్రాణాలను రక్షించిన గొప్ప నాయకుడు అతను అని పేర్కొన్నారు. ప్రజలకు ఆరోగ్యశ్రీ ద్వారా మేలైన వైద్యాన్ని అందించిన ఘనత ఆయనదని కొనియాడారు. వైయస్ పాలనలో పేద ప్రజలు అడిగిన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు లభించాయని గుర్తు చేశారు. సంక్షేమ పథకాల అమలుతీరులో
నాటి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలన మార్కు మరి ఎవరికి సాధ్యం కాదని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన వారిలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, పట్టణ అధ్యక్షుడు కే చెన్నయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ విశ్వం, కాంగ్రెస్ నాయకులు బాలరాజు గౌడ్, చెంది తిరుపతిరెడ్డి, రఘునాయక్, జమృత్ ఖాన్, రఘుమా రెడ్డి, మసూద్ ఖాన్, పురుషోత్తం రెడ్డి, ఇబ్రహీం, కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్, యువనేత అందేమోహన్, ముబారక్ ఖాన్, గోదా మాధవులు, జంగారి రవి, మాజీ కౌన్సిలర్ కృష్ణవేణి, డంగు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపిటిసి శ్రీశైలం, మహిళా నాయకురాలు వర్ష, లింగారం యాదయ్య, బీసీ సేన అసెంబ్లీ అధ్యక్షుడు కత్తి చంద్రశేఖరప్ప, మన పార్టీ ప్రదీప్ కుమార్, కొప్పునూరు ప్రవీణ్, దిలీప్, నల్లమోని శ్రీధర్, వీర్లపల్లి అన్వర్, లింగారెడ్డిగూడెం అశోక్ తదితరులు పాల్గొన్నారు.. *KP*
