(adsbygoogle = window.adsbygoogle || []).push({});
10 తేదీ న సద్గురు షిరిడి సాయి బాబా మందిరం లో “గురు పౌర్ణమి మహోత్సవములు”…
కొల్లాపూర్ జూలై 8(నేటి సత్యం ప్రతినిధి. యస్.పి. మల్లికార్జున సాగర్ ).
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం పెంట్ల వెల్లి మండలం లోని శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సద్గురు షిరిడి సాయిబాబా మందిరం లో గురు పౌర్ణమి మహోత్సవం లను నీర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు.
ఈ నెల 10వ తేదీ ఉదయం5.30 నిమిషాలకు షిరిడి సాయిబాబా వారి కి సుప్రభాత సేవ, 7 గంటలకు గణపతి పూజ 7:30కు సాయినాధునికి క్షీరాభిషేకం, అష్టోత్తర పుష్పార్చన, మహా మంగళహరతి , మంత్రపుష్పం, తీర్థ ప్రసాదరణ వితరణ కార్యక్రమం లు ఉంటాయని వారు తెలియజేశారు.
10 తేదీ ఉదయం 10:30కు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, 12 గంటలకు సాయినాధునికి మహా మంగళహారతి అనంతరం తీర్థ ప్రసాదములు, ఒంటిగంటకు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని వారు తెలియజేశారు.
అలాగే 10 తేదీ సాయంత్రం 5:30 కి సాయి మందిరం లో సామూహిక సాయి లలిత కుంకుమార్చన 6:15 నిమిషములకు సంద్యా హారతి, 7.30 నిమిషాలకు భజనతో సాయి పల్లకి సేవ, 8.30 స్వామివారి మహా మంగళహారతి షే జ్ హారతి ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలియజేశారు.
అలాగే ప్రతి గురు వారం మధ్యాహ్నం ఒంటిగంటకు పెంట్లవెల్లి లోని సాయి మందిరం లో భక్తులకు అన్నదాన వితరణ ఉంటుందని ఆలయ ఫౌండర్ చైర్మన్ ట్రస్టు సభ్యులు తెలియజేశారు.
స్వామి వారి అన్నదాన వితరణ, పూజాదీ కార్యక్రమములలో భాగస్తులు కావాల్సినవారు, దాతలు 9908909052, 8143828176, 7793323206,900917331l లకు ఫోన్ చేసి సంప్రదించవచ్చునని వారు తెలియజేశారు.