అబద్దాలు చెప్పినందుకు అమాత్యులు
“జూపల్లి” కి జర్నలిస్టుల కృతజ్ఞత సభ..
కొల్లాపూర్, జూలై 8 (నేటి సత్యం ప్రతినిధి :యస్.పి. మల్లికార్జున సాగర్).
కొల్లాపూర్ పట్టణం లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని గత 14 రోజులుగా టిడబ్ల్యూజే ఎఫ్ ఆధ్వర్యం లో కొల్లాపూర్ ఆర్డిఓ కార్యాలయం ముందు జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలస్యం గా నైనా గుర్తించి జర్నలిస్టుల దీక్షల గురించి అబద్ధాలు చెప్పినందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు కు నిరసనతో కూడిన అభినందన సభ ను కొల్లాపూర్ జర్నలిస్టులు నిర్వహించారు.
కొల్లాపూర్ లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ గత నెల 25 నుంచి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 14వ రోజుకు చేరుకున్నాయి. ఇన్నాళ్లు జర్నలిస్టుల దీక్షలను పట్టించుకోని కొల్లాపూర్ శాసనసభ్యులు, మంత్రి జూపల్లి కృష్ణారావు “ఆడలేక మధ్యల డోలు” చందము గా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయ లేక జర్నలిస్టుల దీక్షలకు రాజకీయ రంగులు పులుము తూ తన చేతగాని తనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియా ముందు సహచర శాసనసభ్యుల తో కూడి జర్నలిస్టులపై తన అక్కసును కక్కారు.
మంగళవారం రోజు అచ్చంపేట నియోజకవర్గ కేంద్రం లో మంత్రి జూపల్లి కృష్ణారావు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి లతో కలిసి విలేకరుల సమావేశం లో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కొల్లాపూర్ లో ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలంటు జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల గురించి అబద్దాలు చెబుతూ జర్నలిస్టులకు రాజకీయ రంగును రుద్దు తూ అబద్దాలను సైతం అందం గా వివరించేందుకు ఆలస్యం గా అయినా స్పందించినందుకు దీక్ష శిబిరం లో జర్నలిస్టులు మంత్రి జూపల్లి కృష్ణారావు కు నిరసన తో కూడిన కృతజ్ఞత సభ నిర్వహించారు.
టిడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కన్వీనర్ జలకం మద్దిలేటి అధ్యక్షతన జరిగిన కార్యక్రమం లో బిజెపి నాయకుడు దళిత నేత బంకల వెంకటస్వామి మాట్లాడుతూ కొల్లాపూర్ లోని జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారం లేక ముందు ఒక మాట మాట్లాడిండు అధికారం లోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట మాట్లాడుతు చాలా తప్పు చేస్తున్నారని విమర్శించారు.
టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ మాట్లాడుతూ సోమవారం రాష్ట్ర మంత్రి, కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అచ్చంపేట తాలూకాలో పక్క నియోజక వర్గం లో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అచ్చంపేట ఎమ్మెల్యే ఇంకో మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి లతో చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి అచ్చంపేటకు వెళ్లారు.
కొల్లాపూర్ నియోజవర్గానికి చెందిన జర్నలిస్టుల ఇళ్ల స్థలాల డిమాండ్ ను గుర్తించి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడారు అంటే జర్నలిస్టుల పైన ఆయనకు కొల్లాపూర్ ప్రాంత ఎమ్మెల్యేగా మంత్రిగా ఎంత ప్రేమ ఉందనేది అర్థమవుతుందనీ వ్యంగ్యం గా అన్నారు.
సొంత నియోజకవర్గం లో 13 రోజుల పాటు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ జర్నలిస్టులు రిలే దీక్షలు చేసిన అనంతరం ఇప్పటికైనా స్పందించినందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం లో 130 మంది జర్నలిస్టులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉన్నారని వారి యొక్క వ్యక్తిగత వివరాలను కూడా తీసుకున్నా ను అన్న మంత్రి అర్హులైన వారు ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారో వారి అందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆయన కొల్లాపూర్ శాసనసభ్యులు మంత్రి జూపల్లి కృష్ణారావు ను డిమాండ్ చేశారు.
జర్నలిస్టుల హక్కుల ప్రకారం జర్నలిస్టులు ఇండ్ల స్థలాలు ఇవ్వమని అడుగుతున్నామని అంతే తప్ప ఎవరి దయ దాక్షిణ్యాల్లో జర్నలిస్టులపై చూపెట్టమని కోరడం లేదని ఆయన అన్నారు.
జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ఆధారం గా ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి 1100 మంది జర్నలిస్టులకు హైదరాబాద్లో మీ ముఖ్యమంత్రి పాల్గొని పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఆ పట్టాలు బిపిఎల్ కింద ఇచ్చారా…? జర్నలిస్టు కోటా కింద ఇచ్చారా..? అనే విషయాన్ని సోయి లేని మంత్రి జూపల్లి కృష్ణారావు ఒక్కసారి గుర్తించుకుంటే మంచిదని తాటికొండ మంత్రి జూపల్లి కృష్ణారావు కు సూచించారు.
సామాజిక స్పృహ ఉన్నవాళ్లు జర్నలిస్టులని, సామాజిక స్పృహతో ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల పక్షాన నిలబడిన జర్నలిస్టులకు మీరు ఏ రకమైన పేర్లు పెట్టినా మాకు అభ్యంతరం లేదనీ ఆయన అన్నారు.
చింతించాల్సిన విషయం ఏమిటంటే మంత్రి జూపల్లి కృష్ణారావు రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి జర్నలిస్టుల సలహాలు తీసుకొని వాళ్లతో వార్తలు రాయించుకున్నారో వాళ్ళ సలహాలు సూచనలు పాటించారో అలాంటి వారు దీక్షలో కూర్చున్నారని మీకు గుర్తు చేస్తున్నానన్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత 14 రోజులుగా కొల్లాపూర్ లో నిరాహార దీక్షలు చేస్తున్న జర్నలిస్టులు జర్నలిస్టులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించడం హాస్యాస్పదం గా ఉన్నదని ఏదియమైనా దీక్షలు చేస్తున్న 15 మందికి కాకుండా మిగిలిన 115 మంది జర్నలిస్టుల కైన ఇళ్ల పట్టాలు ఇచ్చి మంత్రి జూపల్లి కృష్ణారావు తన చిత్తశుద్ధిని జర్నలిస్టుల సంక్షేమం కోరేవాడిగా రుజువు చేసుకోవాలని తాడికొండ కృష్ణ మంత్రి కృష్ణారావు ను డిమాండ్ చేశారు.
పెంట్లవెల్లి సీనియర్ రిపోర్టర్ శివ మాట్లాడుతూ మా హక్కుల కోసం మేము పోరాడుతున్నామని కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు ఎమ్మెల్యేలకు ప్లాట్లు పొందినట్లు తెలిపారు. మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కూడా మీరు ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం పొందినప్పుడు జర్నలిస్టులు ఎందుకు ఇళ్ల స్థలాలకు అర్హత లేనివారో మంత్రి జూపల్లి కృష్ణారావు తెలపాలన్నారు.
టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు రామచంద్ర మాట్లాడుతూ సమాజం లో జరుగుతున్న విషయాలను పదిమందికి తెలియాలని జర్నలిస్టులు వార్తలు రాస్తుంటారన్నారు. పత్రిక విలేకరులు చాలామంది గత 30 సంవత్సరాలుగా అన్ని పార్టీలకు అన్ని నాయకులకు వార్తలు రాశారన్నారు. జర్నలిస్టుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న జర్నలిస్టులు మీకు నచ్చకుంటే పోరాటం చేస్తున్న 15 మంది జర్నలిస్టులకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అన్నారు కదా, అలాంటి జర్నలిస్టులకు మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వకున్నా బాధపడేది లేదు. కానీ మీరు గుర్తించిన ఈ పార్టీ జర్నలిస్టులనుకుంటున్న మిగిలిన 115 మంది జర్నలిస్టుల కై నా ఇంటి స్థలాలు ఇవ్వాలని అంతవరకు మా పోరాటం కొనసాగుతుందని ఆయన మంత్రి జూపల్లి కృష్ణారావుకు గుర్తుచేశారు.
సమావేశం లో పెద్ద కొత్తపల్లి సీనియర్ జర్నలిస్టు మల్లేష్ కూడా మాట్లాడారు. ఈ దీక్షలలో సీనియర్ జర్నలిస్టు బచ్చలకూర కురుమయ్య, సిపి నాయుడు, రమణౌజీరావు కారంకి గోవిందు, కళ్లెపు భాను ప్రకాష్, బాబు, గోపాసి కేశవులు, స్వాములు, సురేందర్ తరుణ్ పాల్గొన్నారు.
