Neti Satyam
Newspaper Banner
Date of Publish : 09 July 2025, 3:55 pm Editor : Admin

నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలి పాలమాకుల జంగయ్య




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం. జులై 9 చేవెళ్లే

*నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి*

*కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలి*

*ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలి*

*చేవెళ్ల పట్టణ కేంద్రంలో ర్యాలీ నిరసన హైదరాబాద్ బీజాపూర్ హైవే దిగ్బంధం*

*సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య*

ఈరోజు అఖిలభారత సార్వత్రిక సమ్మెలో భాగంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వడ్ల సత్యనారాయణ అధ్యక్షతన అఖిలభారత సార్వత్రిక సమ్మెలో భాగంగా ర్యాలీ నిరసన హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి దిగ్బంధం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య హాజరై మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన రైతుల పైన దాడి చేయడం మొదలు పెట్టాడని కార్మికులు పోరాడి సాధించుకున్న 44 రకాల చట్టాలను పెట్టుబడి దారి వర్గానికి కొమ్ముకాస్తూ నాలుగు కోడ్ లుగా చేసి కార్మిక వర్గానికి తీరని అన్యాయాన్ని చేశాడని 29 రకాల చట్టాలను పునరుద్ధరించాలని తెలిపారు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ప్రైవేటు కార్పోరేట్లకు అప్పచెప్పుతున్నాడని వాపోయాడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు రోజుకు ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గిపోతుందని నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే దానికి భిన్నంగా భారతదేశంలో గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని తెలిపారు అదేవిధంగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని పేదరికం పెరిగిపోతుందని రైతుల ఆకలి చావులు ఆగటం లేదని మరి దేశం ఎలా వెలిగిపోతుందో మోడీ గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జిల్లా అధ్యక్షుడు కే రామస్వామి మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం నెలకు 26వేల రూపాయలు ఇవ్వాలని స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని భవన నిర్మాణ రంగ కార్పొరేషన్ను పునరుద్ధరించాలని కనీస వేతనాల చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కార్మికులకు ఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ప్రభు లింగం కౌన్సిల్ సభ్యులు సుధాకర్ గౌడ్ సుభాన్ రెడ్డి 4 మండలాల కార్యదర్శులు ఏం సత్తిరెడ్డి కే శ్రీనివాస్ సుధీర్, శ్రీశైలం ఇన్ సాబ్ జిల్లా అధ్యక్షుడు ఎండి మక్బుల్ బి కే ఎం యు జిల్లా అధ్యక్షుడు జే అంజయ్య ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్ల మంజుల మీనాక్షి ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాల్ రెడ్డి బి ఓ సి జిల్లా నాయకుడు జె శ్రీనివాస్ బోనాల ప్రభాకర్ యాదగిరి లలిత అనెక్స్ గ్లాస్ కంపెనీ కార్మికులు పాల్గొన్నారు