(adsbygoogle = window.adsbygoogle || []).push({});
తమిళనాడు లో స్కూల్స్ లో కులానికి అడ్డుకట్ట.
జస్టిస్ చంద్రు అదే జైభీమ్ సినిమా రియల్ హీరో ఇచ్చిన నివేదిక ప్రకారం తమిళ నాడులో అన్ని స్కూల్స్ లో కులాన్ని నిర్మూలన వేగవంతం చేసారు.
ఈ సర్క్యులర్ ప్రకారం స్కూల్స్ లో కుల వివక్షతో పాటు ఏరకమైన వివక్ష ఉన్న ప్రతీ జిల్లాకి ఏర్పాటైన కమీషన్ దృష్టికి వెళ్తుంది.
స్కూల్స్ లో ఫోన్స్ రద్దు చేసారు.
సోషల్ మీడియా అసత్యకధనాల నిర్థారణ పై కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.
స్కూల్స్ లో కుల గుర్తులను కనీసం రంగులను కూడా అనుమతించరు. చేతికి కుల తాళ్ళు
కులాన్ని సూచించే రంగు రిబ్బన్లు కూడా అనుమతించరు.నలుపు తెలుపు రిబ్బన్లు మాత్రమే అనుమతిస్తారు.
సైకిళ్ళ పై పుస్తకాలపై కుల గుర్తులను అనుమతించరు.
వీధుల్లో కులాలకు సంబంధించిన పోస్టర్లు జెండాలు కూడా అనుమతించరు.దీని కోసం తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతారు.
కుల వివక్ష చూపించే ఉపాధ్యాయులపై సీరియస్ యాక్షన్స్ ఉంటాయి.బదిలీలు సస్పెన్షన్స్ ఉంటాయి.
ప్రతీ నెల ఉపాధ్యాయులు స్కూల్ తరుపున నేవేదిక పంపాలి.
సీసీ కెమెరాలతో స్కూల్లో నిఘా ఉంచుతారు.
ఏదేమైనా ఈ కార్యక్రమం విజయవంతం కావాలి.దేశమంతా వ్యాపించాలి.
చాన్నాళ్ళకు దేశంలో కులాన్ని నిర్మూలించడానికి సరైన కార్యాచరణ అమలవుతోంది.