Neti Satyam
Newspaper Banner
Date of Publish : 12 July 2025, 3:15 am Editor : Admin

భారతదేశానికి తల వంపు తెచ్చేలా ప్రధాని




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జులై 11


భారతదేశానికి తలవంపులు తెచ్చేలా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గులాంలా వ్యవహరిస్తున్నడని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ఇజ్రాయిల్ మద్ధతు ఇవ్వాలని, పాకిస్తాన్ టెర్రస్టులను ఎగదొస్తున్న అడ్డుకొవద్దని ట్రంప్ చేస్తున్న ఒత్తిళ్లకు మోదీ తలొగ్గారని మండిపడ్డారు. భారతదేశానికి తలవంపులు చేసేలా మోదీ పాలన సాగుతుందని విమర్శించారు. హైదరాబాద్ మఖ్దూం భవన్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి,పశ్య పద్మ, రాష్ట్ర కార్యదర్శి, సిపిఐ శాసనపక్ష నాయకులు కూనంనేని సాంబశివ రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కళవేణి శంకర్, తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు, ఎం.బాల్ నర్సింగ్ కలిసి నారాయణ మాట్లాడారు. బిజెపి ప్రభుత్వం వచ్చాక దేశంలో సంక్షోభంలో పడిందన్నారు. బ్యాంకులను లూటిచేసిన 28 ఫారిన్ విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని అన్నారు. మరోవైపు ట్రంప్ అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. విద్యార్థులు పడుతున్నారని ఆవేదనవ వ్యక్తం చేశారు. రష్యా, ఇరాన్ తక్కువ ధరకు ఆయిల్ విక్రయిస్తామంటే కొనుగోలు చేయనివ్వడం లేదన్నారు. మోదీ ట్రంప్ గులాంలా వ్యహరిస్తున్నడని విమర్శించారు. పాడిచ్చేరి ప్రభుత్వం బిజెపికి అనుకూలంగా ఉన్నా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అక్కడ ముఖ్యమంత్రికి కనీసం క్లర్క్ కూడా బదిలీ చేసే అధికారం లేదన్నారు. తమిళనాడు, కేరళలలో గవర్నర్లు కేబినెట్ నిర్ణయాలను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. తమ తాబేదర్ల ప్రభుత్వం ఉండాలి తప్ప ఇతరులు ఉండొద్దనే విధంగా కేంద్ర ప్రభుత్వ తీరు ఉందన్నారు. విపరితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, ధరల అదుపుదల కోసం ఉధృతంగా పోరాటాలు చేయాలన్నారు. ఆర్ చెప్పిన వాళ్లే ఓట్లు వేసేవిధంగా బిహార్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక కమిషన్ బిజెపి పప్పేట్ మారిందని విమర్శించారు.
నక్సలైట్లు యుద్ధం ఆపినా చంపుతున్నారు..
నక్సలైట్లు యుద్ధం ఆపిన వారిని చంపుతున్నారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నంబాల కేశవ్ రావు యుద్ధం ఆపి, చర్చలకు సిద్ధమని ప్రకటించిన తరువాత కూడా చంపేశారన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు ఇది కాదన్నారు. ఫ్యాక్షన్ తరహాలో కేంద్ర ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. నక్సలిజాన్ని చంపడం మోదీ, అమిత్ తరం కాదన్నారు. ఆయుధాలు వదిలేస్తే చర్చలు అంటున్నారని, మణిపూర్ కుంకీలకు ఆయుధాలు ఇచ్చింది ఏవరని ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగా కుంకీలకు ఆయుధాలు ఇచ్చి, యుద్ధాన్ని ఎగదొస్తుందేవరన్నారు. మణిపూర్ సారవంతమైన కొండలు, మైన్స్ ఉన్నాయని, వాటిని కార్పొరేట్ ధారాదత్తం చేసేందుకు కేంద్రం కుట్రలు అమలు చేస్తుందన్నారు. నక్సలైట్లు భారతదేశ పౌరులే కాదా అన్నారు. పాకిస్తాన్ చర్చలు జరుపుతారు కానీ, నక్సలైట్లతో చర్చలు ఎందుకు జరపరని ప్రశ్నించారు.
కార్పొరేట్ సన్యాసి రామ్ బాబా..
కార్పొరేట్ సన్యాసి రామ్ బాబా అని నారాయణ విమర్శించారు. నకిలీ మందులు అమ్మారని దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో రామ్ బాబాపై కేసులు ఉన్నాయన్నారు. రామ్ బాబాకు విశాఖలో భూములు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎపిలో ప్రభుత్వం మారినా కింది స్థాయిలో ఎలాంటి మార్పురాలేదన్నారు. జగన్ రెడ్డి హయంలో జరిగిన విధంగానే పాలస సాగుతుందని విమర్శించారు.

*చంద్రబాబు ఓవర్ యాక్షన్ వల్లే బనకచర్ల వివాదం..*
ఎపి సిఎం చంద్రబాబు ఓవర్ యాక్షన్ వల్లే బనకచర్ల వివాదం తలెత్తిందని నారాయణ అన్నారు. రూ.8 వేల కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు చేపట్టారని, ఆది పూర్తయ్యేనాటికి రూ.2 లక్షల కోట్ల వ్యయం అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ప్రాజెక్టు ఉందన్నారు. బిజెపి కానసన్నాల్లో కాంట్రాక్టర్లు ఉన్నారని అన్నారు. కాంట్రాక్టర్ల పెట్టుబడితో ప్రాజెక్టు చేస్తే భవిష్యత్తులో టోల్ గేట్ దగ్గర వాహనాల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు నీటికి డబ్బులు వసూలు చేస్తారన్నారు. బనకచర్లను పోలవరానికి లింకు పెట్టి చంద్రబాబు మాట్లాడారన్నారు. సముంద్రంలోకి వెళ్లే నీటితోనే బనకచర్ల కడుతున్నామని చెప్పుతున్నారని అన్నారు. ముందు ఇరు రాష్ట్రాల సిఎంలు చర్చించిన తరువాత, నీటి వాటాలు తెల్చిన అనంతరం ప్రాజెక్టులు నిర్మించుకోవాలన్నారు. ఈ బాధ్యతను కేంద్ర జల సంఘానికి అప్పగించాలని నారాయణ అన్నారు.

*అసెంబ్లీకి వచ్చి మీ భావాలు చెప్పండి : కూనంనేని సాంబశివ రావు*
అసెంబ్లీకి వచ్చి మీ భావాలు అక్కడ చేప్పండి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(కెసిఆర్)కు సూచించారు. అసెంబ్లీలో అయితే కెసిఆర్, కెటిఆర్ మాట్లాడొచ్చు అన్నారు. కాళేశ్వరానికి అన్ని తానే అని చెప్పుకున్న కెసిఆర్ తరువాత తనకు సంబంధం లేదనడంతో కెసిఆర్ క్రేడిబిలిటీ పోయిందన్నారు. కెటిఆర్ ప్రెస్ క్లబ్ వెళ్లి కుర్చున్నారని, ప్రెస్ క్లబ్ వెళ్లడం సమస్యను పక్కదారి పట్టించడమే అన్నారు. కాళేశ్వరం, బనకచర్ల రెండు సీరియస్ అంశాలే అన్నారు. ఈ రెండు అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీకి ఎందుకు రారు అని ప్రశ్నించారు. ఈ రెండు అంశాలు న్యాయ వ్యవస్థ పరిధిలోకి వెళ్లాయన్నారు. అయినా బిఆర్ సవాళ్లు చేయడం, కెసిఆర్ కమిషన్ ముందు హాజరయ్యేటప్పుడు వందల కార్లతో హడావుడి ఎందుకని ప్రశ్నించారు. అవునాన్న.. కాదన్నా.. కాళేశ్వరం పెద్ద బ్లడర్ అని సాంబశివ రావు అన్నారు. బిఆర్ స్కూల్ నడుపుతుందని, ఎవరైన వ్యతిరేకంగా మాట్లాడితే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీశ్ రెడ్డిలు తామే పడింతులమన్నట్లుగా విమర్శలకు దిగుతున్నారని అన్నారు. అందరికి తేలియనిది మీ ఒక్కరికే తెలుసా? అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే వాళ్లకేం తెలుసు అంటూ దాబాయింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అభిప్రాయాలు చేప్పితే కూడా దాబాయింపులకు పాల్పడమేటని ప్రశ్నించారు. గ్రామాల్లో ఎస్, నో, ఆల్ అనే పదాలతో తమకే ఆంగ్లం వచ్చినట్లు వ్యవహరిస్తారని, అదే మాదిరిగా ఎస్, నో, ఆల్ బ్యాచ్ వచ్చాయని విమర్శించారు. బిఆర్ పంతుళ్లు మంచోళ్లు కాదన్నారు. విద్యారంగంలో ప్రొఫెసర్లు అన్ని అంశాలపై బోధనాలు చేస్తారని, అయితే అన్ని తెలిసిన ప్రొఫెసర్లే సిఎంలు అవుతారా? అని ప్రశ్నించారు. మా అభిప్రాయాలు చెప్పుతామని, వాటిని కూడా విమర్శిస్తే ఎలా అన్నారు. మెడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీరు తరలించేందుకు విద్యుత్ రూ. 1679 కోట్ల వ్యయం అవుతుందన్నారు. మొత్తం ఎత్తిపొతలకు రూ.10 వేల కోట్లు అవుతుందని చెప్పారు. కాళేశ్వరాన్ని బహుబలి ప్రాజెక్టు కాదా, నీరు తరలించేందుకు అదే స్థాయిలో వ్యయం అవుతుందన్నారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే చేయాలని సూచించారు.
బనకచర్ల ప్రాజెక్టు ఆపాలి..
నీటి వాటాలు తేలే వరకు బనకచర్ల ప్రాజెక్టు ఆపాల్సిందేనని కూనంనేని సాంబశివ రావు అన్నారు. మీ వాటా నీళ్లు మీరు తీసుకొంది, మా వాటా నీళ్లు మావి అని అన్నారు. జల సంఘం నీటి వాటాలు తేల్చాలన్నారు. నీటి వాటాలు తేలకుండానే ప్రాజెక్టులు కట్టుతామంటే కారెక్టు కాదన్నారు. భద్రచలంలో ఈఓపై దాడి జరిగిందన్నారు. ఈ ఐదు ఊర్లను తెలంగాణకు వదిలేయలన్నారు. చంద్రబాబు బాధ్యత తీసుకోవాలన్నారు. ఐదు గ్రామాలను వదిలేయలన్నారు. మీరు, మేము కలిసి ఉండొచ్చు అన్నారు.

*పనిగంటలను 8 నుంచి 10 పెంచడం సరైందికాదు..*
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలిసో తెలియాకో 8 పనిగంటలను 10 గంటలకు పెంచడం సరైందికాదని కూనంనేని సాంబశివ రావు అన్నారు. 150 ఏళ్లకు ముందు చికాగోలో జరిగిన పోరాటం ఫలితంగా కార్మికులు 8 పని గంటల హక్కును సాధించుకున్నారని తెలిపారు. 8 పనిగంటల నుంచి 10 గంటలకు పెంచడం కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలకడమే అన్నారు. జి.ఓ 282 నిలువరించాలని కార్మికులు ఆందోళన చేస్తారన్నారు. వారి ఆందోళనకు తాము మద్ధతు ఇస్తామని కూనంనేని సాంబశివ రావు తెలిపారు.
*ఫార్మా కంపెనీల దోపిడికి కార్మికుల బలి..*
ఫార్మా కంపెనీల దోపిడికి కార్మికులు బలి అవుతున్నారని కూనంనేని సాంబశివ రావు అన్నారు. ఇటీవల సిగాచి కంపెనీలో జరిగిన ప్రమాదంలో అమాయకపు కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి, కేవలం రూ.8, 9 వేల వేతనంతో పనిచేయిస్తున్నారని అన్నారు. ఇంత తక్కువ వేతనంతో పనులు చేయిస్తున్న పట్టించుకొని కార్మిక శాఖ సమాధానం చెప్పాలన్నారు. తాను సిగాచి కంపెనీని సందర్శించానని తెలిపారు. సిగాచి కంపెనీ డైరక్టర్ కూడా ప్రమాదం జరిగిన తీరుపై అవగాహన లేదని, పూర్తి నిర్లక్షంతో సిగాచి కంపెనీ యాజమాన్యం వ్యవహరించిందన్నారు. ఫార్మా కంపెనీలు దోపిడికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
*బిసిలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి..*
బిసిలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినేన్స్ తీసుకవస్తామని నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం అని సాంబశివ రావు అన్నారు. అయితే తమిళనాడు తరహాలో 9 షెడ్యూల్ చేర్చి అమలు చేస్తే బాగుటుందన్నారు.

*నరేంద్రమోదీ బ్యాంకులను ముంచిన వాళ్ల పక్షం : చాడ వెంకట్ రెడ్డి*
ప్రధాని నరేంద్ర మోదీ బ్యాంకులను ముంచిన కార్పొరేట్ పక్షం అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. బ్యాంకులను ముంచినవాళ్లు విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారని విమర్శించారు. కార్పొరేట్ అనుకూల, ప్రజావ్యతిరేక విధానాలను మోదీ ప్రభుత్వం అవలంభిస్తుందని మండిపడ్డారు. ప్రశ్నించే వారి గొంతులపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఈడి, ఐటి, సిబిఐ పేరిట వేదింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున మోదీ సర్కార్ వ్యతిరేకంగా ఉద్యమాలు ఉదృతం చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రతి ఐదేళ్లకోసారి తప్పనిసరిగా జరగాలన్నారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు అందవన్నారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణను అమలు చేయాలని చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఎం.డి.యూసుఫ్, నల్ల సుధాకర్ రెడ్డిలను సన్మానించిన నేతలు..
కనీస వేతనాల సంఘం సభ్యులుగా నియమితులైన ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి. యూసుఫ్, మహబూబాబాద్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నియమితులైన నల్ల సుధాకర్ రెడ్డిలను సన్మానిస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కళవేణి శంకర్, పశ్య పద్మ, తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు, ఎం.బాల్ నర్సింగ్