(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*జూలై 11 న అంబేడ్కర్ – రమాబాయి దంపతుల కుమారుడు రాజారత్నను కోల్పోయిన రోజు.*
*✍️అరియ నాగసేన బోధి*
*బౌద్ధ ధమ్మ ప్రచార కర్త*
*డా.బి.ఆర్.అంబేడ్కర్-రమాబాయి దంపతులు యొక్క తనయుడు రాజారత్న 1926 జూలై 11వ తేదీన నిర్యాణం చెందారు. అంబేడ్కర్-రమాబాయి దంపతులకు 1924 సంవత్సరం నాటికే ఐదుగురు పిల్లలు జన్మించారు. ఐదుగురు పిల్లలలో యశ్వంత్ రావు తప్ప మిగిలిన నలుగురు పిల్లలు రెండు, రెండున్నర సంవత్సరాల చిన్న వయసులోనే మరణించారు. రాజారత్న చిన్నవాడు.రమాబాయి అంబేడ్కర్ లకు ఎంతో ఇష్టమైనవాడు రాజారత్న.రాజారత్న కంటే ముందు పుట్టిన పిల్లవాడు చిన్నతనంలోనే మరణించాడు. దీంతో రమాబాయి రాజారత్నను ప్రేమతో చూసుకునేది.1926 జూలైలో రాజారత్నకు డబల్ నిమోనియా సోకి జూలై 11 న మరణించాడు. రాజారత్న మరణంతో అంబేడ్కర్ ఎంతగానో దుక్ఖించారు.రమాబాయి కూడా చిక్కిపోయింది.శారీరకంగా, మానసికంగా బలహీనురాలు అయింది.మాతా రమాబాయి కూడా రాజారత్న మరణం తరువాత ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది.రమాబాయి వైవాహిక జీవితంలో సుఖం లేకపోవడంతో చాలా కృంగిపోయారు. దీనికి తోడు తన పిల్లలు మరణించడం వలన ఆమె ఎంతగానో వేదనకు లోనయ్యారు. అంబేడ్కర్ కూడా రాత్రి పూట ఎక్కువ సమయం మేల్కొని ఉండేవారు.*
*రమాబాయి, అంబేడ్కర్ ,రాజారత్నలకు జింక అంటే ఎంతో ఇష్టం.ఒక జింకను కూడా ఎంతో ప్రేమగా ఇంట్లో పెంచుకునేవారు.ఆ జింకకు కూడా రాజారత్న అంటే ఎంతో ఇష్టం. రాజారత్న మరణించిన తరువాత ఆ జింక కూడా అనారోగ్యంతో చూస్తూ ఉండగానే మరణించింది.అంబేడ్కర్, రమాబాయిలు జింక మరణించడంతో మరింత దుక్ఖించారు. తన కుటుంబంతో సహా మకాంను అంబేడ్కర్ రాజగహకు మార్చారు.రక్తహీనతతో రమాబాయి 1926 న నిర్యాణం చెందారు.*
*అంబేడ్కర్, రమాబాయి దంపతులు చేసిన త్యాగాలు వలనే భారతదేశంలోని ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఈ మాత్రం అయినా లభించింది. వీళ్ళే గనుక ఇన్ని త్యాగాలు చేసి ఉండకపోతే మనదేశంలో ఈపాటి ప్రజాస్వామ్యం ఉండేది కాదు.పూర్తిగా ఫాసిస్టు పాలన వచ్చి ఉండేది.*
*రాజారత్నకు నివాళులు.*