(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం. శేరిలింగంపల్లి. జూలై. 12



* గచ్చిబౌలి గౌలిదొడ్డి
బసవతారక నగర్ గుడిసె వాసులకు అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలి. పానుగంటి పర్వతాలు*.
నేటి సత్యం. గచ్చిబౌలి. శేర్లింగంపల్లి
దాదాపు 30 సంవత్సరాల నుండి. పొట్ట జీవనం కోసం గుడిసెలు వేసుకొని జీవిస్తున్న వీరికి. ఇక్కడే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ లిస్టు కార్డు. ఉన్నాయి.
కొంతమందికి ఇక్కడే పెళ్లిళ్లు జరిగినాయి పిల్లలు పుట్టారు. కొంతమంది ఇక్కడ చనిపోయి ఇక్కడే దహన సంస్కారాలు చేశారు. ఈలా చరిత్ర ఉన్న వీళ్ళకు. న్యాయం జరగాలి…
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక న్యాయం. గూటి కోసం కూటి కోసం బ్రతుకుతున్న. ప్రజలకు ఒక న్యాయం పాలకులు ఎవరైనా కావచ్చు పార్టీలు ఏవైనా కావచ్చు కానీ పేద ప్రజలపై చూపుతున్న చేస్తున్న అన్యాయం ఒకటే.
అందుకే ఈరోజు ఎర్రజెండా పార్టీలు పేదవారికి అండగా నిలిచాయి బసవతారక నగర్ ప్రజలకు ఇక్కడే ఇల్లు నిర్మించి ఇచ్చేవరకు. ప్రజా ఉద్యమాలు చేసి ప్రభుత్వాల మెడలు వంచి ఇక్కడే ఇల్లు. పట్టాలు ఇప్పించే వరకు. ఆగదు ఈ పోరాటం అన్నారు…ఈ కార్యక్రమంలో…శేర్లింగంపల్లి నియోజకవర్గం కార్యదర్శి సిపిఐ రామకృష్ణ పాల్గొని మాట్లాడుతూ. గత బిఆర్ఎస్ ప్రభుత్వం గుడిసెలు కుల్చినప్పుడు. ఈరోజు ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక్కడికి వచ్చి పరమశించి. వీళ్లకు మా. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలు కనపడడం లేదా. అని అన్నారు. ఈ కార్యక్రమంలో కె చందు యాదవ్ శేర్లింగంపల్లి సిపిఐ సహాయ కార్యదర్శి. బి నారాయణ. కే కృష్ణ సిపిఎం జగదీష్ సిపిఎం తదితరులు పాల్గొన్నారు.