నేటి సత్యం నాగర్ కర్నూల్ జులై 12
*ఘనంగా మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం*
*మంత్రులకు ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు మరియు నియోజకవర్గ ప్రజానీకం*
నేటి సత్యం.నాగర్ కర్నూల్. జూలై 12
జిల్లా కేంద్రంలో 180 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం మరియు అక్కడే 285 కోట్లతో మంజూరు అయిన 550 పడకల నూతన ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు.
ఇట్టి కార్యక్రమానికి గౌరవ నాగర్ కర్నూల్ ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు అధ్యక్షత వహించగా వారితో పాటు ముఖ్య అతిథులు రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మరియు పాలమూరు జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ దామోదర రాజనరసింహ గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణా రావు గారు, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి గారు ఎమ్మేల్యే లు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు 550 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన జరగడం చాలా సంతోషకరం.
విద్య, వైద్యం కోసం ఎన్నో కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ప్రజాప్రభుత్వం ఇట్టి రంగాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచవచ్చు అని పేర్కొన్నారు.
అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నిర్మాణానికి రూ.9 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2,500 మంది విద్యార్థులకు అనువుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొనసాగుతోందన్నారు.
మెడికల్ కాలేజీకి తగిన రవాణా సదుపాయాలు, క్రీడా మైదానాలు, వసతిగృహాలు ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని గుర్తు చేశారు.
మెడికల్ కాలేజీలో తగిన స్టాఫ్ నియామకం కూడా అత్యవసరమని సంభందిత మంత్రి గారిని కోరడం జరిగింది.
నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయాలని మరో మంత్రి శ్రీ కోమటిరెడ్డి గారిని కోరారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు గారు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు వినోద్ గారు,మండల అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు