(adsbygoogle = window.adsbygoogle || []).push({});
*సీపీఐ 4వ రాష్ట్ర మహాసభల లోగోను ఆవిష్కరించిన చాడ వెంకట్ రెడ్డి*
*మహాసభల విజయవంతానికి ఇంటింటికీ సీపీఐ పేరుతో ప్రచారం నిర్వహించాలి*
CPI తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల లోగోను ఆవిష్కరించిన సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకట్ రెడ్డి గారు. ఈ మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం హిమాయత్ నగర్ లోని రాజ్ బహదూర్ హాల్ లో జరగగా, సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటీ. నర్సింహా, కలవేణి శంకర్, శ్రామిక మహిళా ఫోరం జాతీయ నాయకురాలు ప్రేమ్ పావని, రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘ అధ్యక్షుడు ఎండీ. యూసుఫ్, ప్రధాన కార్యదర్శి ఈ. ఉమామహేష్ ,సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ.దామోదర్ రెడ్డి,లక్ష్మీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర, డీహెచ్ పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మారుపాక అనీల్ కుమార్,అధ్యక్షులు ఏసురత్నం ఏఐటీయూసీ సీనియర్ నేత రత్నాకర్ రావు, ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…..
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సిపిఐ రాష్ట్ర మహాసభల సందర్బంగా సిపిఐ కార్యకర్తలు ఇంటిఇంటికి వెళ్లి పార్టీ లక్ష్యాలను వివరిస్తూ వారి వద్ద చందలను వసులు చేసి మహాసభలను జయప్రదం కోసం పని చెయ్యాలని కార్యకర్తలను కోరారు.మేడ్చల్ జిల్లాలో పార్టీ అనేక బస్తిలను వేసి వేలాది మందికి గుడిసెలను వేసి భములను పంచిన చరిత్ర ఉందని ఆ చరిత్రను చెప్పుతూ,ప్రజల కోసం నిత్యం పని చేసే పార్టీ సిపిఐ అని ప్రచారం చెయ్యాలని రానున్న రోజులో మహాసభల అనంతరం ప్రభుత్వ భూములను పేదలకు పంచడానికి ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు.
*ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రచ్చ కిషన్, స్వామి,హరినాథ్,కృష్ణ,శ్రీనివాస్, సత్య ప్రసాద్,జిల్లా నాయకులు ప్రమీల,మహాలక్ష్మి,గిరిజ,యాదయ్య,బాబు,జంగయ్య,బాపూరాజు,అజీజ్,పరమేశ్వర్,ఐలయ్య,రమేష్,వెంకటేష్,మనోహర చారీ తదితరులు పాల్గొన్నారు.*