(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇక్కడ నేనే జడ్జ్.
నేటి సత్యం. షాబాద్. జులై 14
* షాబాద్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థిని చితకబాది, బూటు కాలితో తన్నిన హెడ్మాస్టర్ గోవింద్.
* నా స్కూల్ నా ఇష్టం నువ్వు ఎవరు మాట్లాడడానికి
* గతంలో ఎన్నోసార్లు ఇతనిపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసిన షాబాద్ గ్రామ ప్రజలు.
రంగారెడ్డి జిల్లా : షాబాద్ మండలం…
విషయం తెలుసుకున్న పిడిఎస్ యు విద్యార్థి సంఘం నాయకులు రాజేష్ పాఠశాల ని సందర్శించి విద్యార్థిని ఏం జరిగిందని విషయం అడిగి తెలుసుకున్నారు. రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల హెడ్మాస్టర్ గోవింద్ తీరే వేరు గా ఉంది. ఈరోజు తేదీ : 11 /07/ 2025 న ఉదయం సమయంలో 6వ తరగతి అబ్బాయి మరో అబ్బాయి ఇద్దరూ చిన్న గొడవ పడటంతో రాకేష్ అనే అబ్బాయి మరో విద్యార్థి బ్యాగ్ ని బెంచీల చివరన పెట్టాడు దాంతో మరో అబ్బాయి ప్రిన్సిపల్ కి కంప్లీట్ చేయడంతో ప్రిన్సిపల్ క్లాస్ రూమ్ లోకి వచ్చి బ్యాగ్ ని తీసింది రాకేష్ అని తెలుసుకొని ఇష్టం వచ్చినట్టుగా అబ్బాయిని కొట్టడమే కాకుండా కింద పడిపోయిన తర్వాత బూటు కాలుతో తన్నడం జరిగిందని విద్యార్థి రాకేష్ పిడిఎస్ యు నాయకులు రాజేష్ కి తన బాధని చెప్పుకోవడం జరిగింది.
ఇలా ఒక ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ గా ఉన్నటువంటి గోవింద్ విద్యార్థుల పట్ల ఇంత కరకషత్వంగా ప్రవర్తించడం చాలా దారుణం అదేవిధంగా ఇతని పైన షాబాద్ గ్రామ ప్రజలు ఎన్నోసార్లు పై అధికారులకు కంప్లైంట్ చేసిన వారు కూడా చూసి చూడనట్టుగా వదిలేసారని, ఇలాంటి వారిని ఇలా వదిలేయడంతోటే నిత్య కృత్యం ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఎస్సీ హాస్టల్ విద్యార్థులను కూడా చిన్నచూపు చూస్తూ బర్లు తిన్నట్టు తింటారు కొడుకులు అని విద్యార్థులను అంటారని విద్యార్థులు చెప్పడం జరిగింది. ఇలాంటి వ్యక్తిని వెంటనే విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పాఠశాలకు వస్తున్నటువంటి ఫండ్స్ ఎక్కడికి పోయాయి.. ఇతని పైన జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎసు ) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది.
అలాగే ఈ ఘటన పైన ప్రజా ప్రతినిధులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, సమాచార హక్కు చట్టం నాయకులు, మేధావులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు, స్పందించాల్సిందిగా పి.డి.ఎస్.యు విద్యార్థి సంఘంగా కోరుతున్నాం.