నేటి సత్యం సింగరేణి



ప్రపంచంలోనే పెద్ద పార్టీ కమ్యూనిస్టు పార్టీ
పేదల పక్షాన పోరాడేది ఎర్రజెండా నే
ప్రశ్నించినందుకే మావోయిస్టులను ను చంపుతారా..!
పోరాటాలతోనే సమస్యల పరిష్కారం
సింగరేణి సమస్యల పరిష్కారానికి కృషి
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిపించాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
కమ్యూనిజానికి అంతం లేదని,
మానవ సమాజం ఉన్నంతవరకు కమ్యూనిజం ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబేద్కర్ సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అధ్యక్షత వహించగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కల్లపల్లి శ్రీనివాసరావు తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని సందర్భంగా కేటీకే ఫైవ్ ఇంక్లైన్ ఆర్చి నుండి జయశంకర్ విగ్రహం మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని ప్రపంచంలో ఏ దేశంలోనైనా కమ్యూనిస్టులు ఉంటారని, ఇతర బూర్జువా పార్టీలు వారి ప్రాంతాలకు పరిమిత మైతారని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలుగా పూర్తి చేసుకుందని, నాడు నేడు ఎప్పటికీ పేదల పక్షాన నిలబడేది ఎర్రజెండా పార్టీ అని ఆయన కొనియాడారు. ఆకలి కోసం దొంగతనాలు చేసే వాడు దొంగ కాదని చట్టపరిధిలో వేల కోట్లు కొల్లగొట్టే వారు నిజమైన దొంగలు ఇతర పార్టీలో ఉన్నారని అన్నారు. దేశంలో పెట్టుబడిదారులు కార్మికుల శ్రమను దోపిడి చేస్తున్నారని అసమానతలు లేని సమాజం నిర్మించడమే కమ్యూనిస్టు లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ అంగన్వాడి ప్రైవేట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. దోపిడిని ప్రశ్నించేవాడు కమ్యూనిస్టులైన మావోయిస్టులను అమిత్ షా 2026 మార్చి వరకు అంతం చేస్తామని చెప్పడం దుర్మార్గం అన్నారు. మావోయిస్టులు అంటే ఎవరో కాదని వారు మనవాళ్లేనని ఆపరేషన్ కగార్ పేరు తో చంపడం అటవీక న్యాయమని ప్రశ్నించారు. అసలు దొంగలు మోడీ నుండి ముఖ్యమంత్రి వరకు ఉన్నారని దోపిడీ చేసిన వారిని చంపుతున్నారని చట్టాలు ఉన్నాయి కదా అని సూటిగా ప్రశ్నించారు. ఒక కమ్యూనిస్టు చనిపోతే 100 మంది కమ్యూనిస్టులు పుడతారని కమ్యూనిస్టు ల కు మరణం లేదని దోపిడి ఉన్నంతవరకు మానవ సమాజం ఉన్నంతవరకు కమ్యూనిజం ఉంటుందని అన్నారు. ఎప్పటికైనా సమన్యాయం రావాలని, కాలం కలిసి వస్తే ఎప్పటికైనా సమ సమాజం వస్తుందని, ప్రశ్నించే వారికి కష్టాలు రావచ్చు కానీ అంతిమంగా గెలిచేది కమ్యూనిస్టులేనని దీమా వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న అనేక సమస్యలు పరిష్కారం కావాలంటే పోరాటాల ద్వారానే సాధ్యమవుతుందని అన్నారు. జిల్లాలో అనేక సింగరేణి కార్మికుల సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని అన్నారు. జిల్లా కేంద్రంలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్న గుడిసె వాసులకు పట్టాలి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలుచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలో సిపిఐ పార్టీ అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఉందని, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కళాశాల, బొగ్గు ఆధారిత పరిశ్రమలు రావాలన్నారు. కాలేశ్వరం నీళ్లు గత ప్రభుత్వాలు తరలించుకు వెళ్లారని వాటిపై ఉద్యమించామన్నారు. భూపాలపల్లి జిల్లా సమగ్ర అభివృద్ధికి మహాసభలో అనేక తీర్మానాలు చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో జిల్లా అభివృద్ధికి ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శిలు గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, పైళ్ళ శాంతి కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు క్యాథరాజ్ సతీష్, కొరిమి సుగుణ, మాతంగి రామ్ చందర్, మామిడాల సమ్మిరెడ్డి, సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్, నేరెళ్ల జోసెఫ్, కుడుదుల వెంకటేష్, పెంట రవి సుమారు 1000 మంది పాల్గొన్నారు.