(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం శేరిలింగంపల్లి జులై 14
*నేతాజీ నగర్ కాలనీలో ఆదివారం నాడు శ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ తల్లి నల్ల పోచమ్మ తల్లి బోనాల జాతర: బేరి రామచంద్ర యాదవ్ ఆలయ కమిటీ సభ్యులు*
నేతాజీ నగర్ కాలనీలో జులై 20వ తేదీ ఆదివారం నాడు శ్రీ భగవతీ రేణుక ఎల్లమ్మ నల్ల పోచమ్మ ఆలయంలో బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని కాలనీ అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ గారు తెలిపారు. ఈ కార్యక్రమానికి నేతాజీ నగర్ కాలనీలో ఉన్న ప్రతి ఇంటి నుండి రెండు బోనాలు ఒకటి రేణుక ఎల్లమ్మ తల్లికి రెండవది నల్ల పోచమ్మ తల్లికి సమర్పించుకోవాలని తెలిపారు. స్వయంభుగా వెలసిన శ్రీ భగవతి రేణుక ఎల్లమ్మ తల్లి నల్ల పోచమ్మ తల్లులకు మనస్ఫూర్తిగా నియమనిష్ఠలతో బోనాలు సమర్పించుకొని ఆ దేవతల కరుణ కృపా కటాక్షాలు పొందాలని అన్నారు. ఆ తల్లి కృపకు మీరు పాత్రులైతే విద్యావంతులవుతారు ఆరోగ్యవంతులవుతారు వృత్తులపరంగా అభివృద్ధి చెందుతారు పాడిపంటలు ఘనంగా పండుతాయి వ్యాపారం అంతకంతకు అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. కాలనీలో ఉన్న ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆ తల్లి కృపకు పాత్రులు కావాలని అన్నారు. ఆలయ కమిటీ సమావేశంలో పాల్గొన్న కాలనీ పెద్దలు, మహిళా సోదరీమణులు మరియు యువజన నాయకులు
*ఇట్లు*
*ఆలయ కమిటీ సభ్యులు* కే నరసింహ యాదవ్ రవి నాయక్, రాయుడు, జయ రెడ్డి, రాధారాన్ రెడ్డి, లాల్ రెడ్డి, అన్నదొర ప్రసాద్ చారి, అంజిరెడ్డి, గంగమ్మ, సత్తెమ్మ, మనీ మేఘమాల, రాములు నాయక్, నరేష్ నాయక్, సురేష్ నాయక్, దశరథ్ నాయక్, గణేష్ నాయక్, రాజు నాయక్, విట్టల్ నాయక్, డీజే భువన్, లవణాచారి, అశోక్,
*భేరి రామచందర్ యాదవ్*